Chinese kids vs Indian Kids: పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. కానీ దాని కోసం తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో దృష్టిలో పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. కనీసం స్కూల్ నుంచి వచ్చిన పిల్లల హోమ్ వర్క్ చూసే సమయం లేని తల్లిదండ్రులు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు. పిల్లల విషయంలో డబ్బును మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ వారికి నేర్పించే స్కిల్స్ గురించి చాలా మంది ఆలోచించడం లేదు. ఇలాంటి లైఫ్ స్టైల్ వల్ల పిల్లలు చాలా సమస్యలు ఎదుర్కుంటారు అంటున్నారు నిపుణులు.
ప్రపంచంలోనే చైనాను ఒక గొప్ప దేశంగా గుర్తించారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. అయితే ప్రస్తుతం పిల్లల లైఫ్ స్టైల్ ను గమనిస్తే ఎక్కువగా ఫోన్, టీవీ, వీడియో గేమ్స్ వరకు మాత్రమే ఆగిపోతున్నారు. బహిరంగ ఆటలు కూడా చాలా వరకు తగ్గాయి. ఫోన్ ప్రపంచంగా బతుకుతున్న పిల్లలు ఎందరో ఉన్నారు. కొన్ని స్కూల్స్ లో గ్రౌండ్ ఉండక అక్కడ కూడా నో గేమ్స్ అన్నట్టుగానే పెరుగుతున్నారు పిల్లలు. అయితే చైనాలో పిల్లలకు మాత్రం మంచి లైఫ్ స్టైల్ ను అందిస్తున్నారు వారి పేరెంట్స్.
5 సంవత్సరాల వయసు నుంచే వారికి అన్ని అలవాట్లను నేర్పిస్తుంటారు. వారి పనులు వారు చేసుకోవడం నుంచి వంట చేయడం వరకు ప్రతి ఒక్క పనిని కూడా నేర్పిస్తుంటారు పేరెంట్స్. స్కూల్ విద్యలో కూడా ఇలాంటి స్కిల్స్ కు ప్రాధాన్యత ఇస్తుంటారు. కూరగాయలు కట్ చేయడం దగ్గర నుంచి వారి షూ, బ్యాగ్, బాటిల్స్, బాక్స్ ప్రిపేర్ చేసుకోవడం వంటి చాలా పనులు నేర్పిస్తుంటారు. ఇసుక, సిమెంట్ల, ఇటుకలను ఎలా వాడాలి వంటి పనులను కూడా నేర్పిస్తారు. అంతేకాదు బట్టలు కుట్టడం దగ్గర నుంచి ఆటలు ఎలా ఆడటం వంటి అన్ని పనులను కూడా నేర్పిస్తుంటారు.
Also Read: మూడో దశకు ప్రభుత్వం సిద్ధమేనా?
కానీ మన పిల్లలు మాత్రం ఏ విధంగా ఎలాంటి అలవాట్లు నేర్చుకుంటున్నారో పిల్లలు కచ్చితంగా అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులే పిల్లలకు మొదటి గురువు. మీ నుంచి చాలా విషయాలను నేర్చుకుంటారు. అందుకే మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించండి. వారికి అన్ని విషయాలను నేర్పించండి. ఫోన్, లాప్ టాప్ లను ఇచ్చి వారిని వదిలేయవద్దు. లేదంటే మీ పిల్లల జీవితం డేంజర్ లో పడుతుంది. క్రియేటివ్ గా థింక్ చేసే అలవాట్లను కూడా పెంపొందించండి. మెదడుకు మేత పెట్టండి. ఇలాంటి వాటి వల్ల పిల్లలు చాలా చురుకు అవుతారు.
ఇంటర్నెట్, యూట్యూబ్, సినిమాలకు పిల్లలను బానిసలను చేయవద్దు. కార్టూన్, వెబ్ సిరీస్ లను చూసే పిల్లలు వాటికి అలవాటు పడిపోతారు. కాస్త సమయం ఉంటే చాలు అందులోనే మునిగితేలుతారు. మీరు చేసే అలవాట్ల వల్ల పిల్లలు కూడా చాలా మారుతారు అని గుర్తు పెట్టుకోండి. నేటి పిల్లలే రేపటి పౌరులు. సో జాగ్రత్త పేరెంట్స్.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.