Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం( International Airport) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా కీలక ముందడుగు పడింది. విమాన ట్రయల్ రన్ జరిగింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ సాంకేతిక పరీక్షలు చేసింది. అందులో భాగంగానే విమాన ట్రయల్ రన్ చేపట్టింది. ప్రస్తుతం ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలను నియంత్రించే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. రన్ వే, సిగ్నల్ వ్యవస్థ వంటి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏటీసీ టవర్ నుంచి వచ్చే సంకేతాలపై AAI, DGCA సంస్థలు పరీక్షలు నిర్వహించాయి.
Also Read: రష్మిక నేషనల్ క్రష్ మాత్రమే కాదు..నాకు కూడా క్రష్ నే – అక్కినేని నాగార్జున
* చిన్న విమానంతో ట్రయల్ రన్
ఇటీవల చిన్న విమానంతో భోగాపురం ఎయిర్పోర్ట్ లో ట్రయల్ రన్( trial run) చేస్తూ పరీక్షలు చేశారు. దీంతో ఆ విమానం ఎయిర్పోర్ట్ లో చక్కర్లు కొట్టింది. ఎయిర్ పోర్టు నిర్మాణం ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ పరీక్షలు చేశారు. విమానాశ్రయంలో ఈ విమానం రన్ వే దగ్గరకు వచ్చి ల్యాండింగ్ అయ్యేందుకు ప్రయత్నించింది. కానీ మళ్ళీ ఎగిరిపోయింది. ఆ విమానం ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రాంతంలో చక్కర్లు కొడుతూ సముద్రం వైపు వెళ్ళింది. ఎయిర్ పోర్టు నిర్మాణంలో ఉన్న కార్మికులు, స్థానికులు దీనిని ఆశ్చర్యంగా చూశారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి విపరీతంగా వైరల్ అయ్యాయి.
* సాంకేతిక పరీక్షల కోసమే..
సిగ్నల్, రన్ వే( runway ) టెస్ట్ కోసం విమానం వచ్చిందని భావిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న విమానాశ్రయ పరిస్థితి, చేయాల్సిన పనులు, చిన్నచిన్న మార్పులు, అడ్డంకులు వంటి వాటిని పరిశీలించడానికి అప్పుడప్పుడు నిర్వాహకులు విమానంతో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ చిన్న విమానం చక్కర్లు కొట్టినట్లు సమాచారం. మరోవైపు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే.. విశాఖపట్నం ఎయిర్పోర్టులో ప్రయాణికులకు విమాన సేవలు నిలిపివేస్తారు. ఈ విమానాశ్రయాన్ని నేవీకి అప్పగించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గన్నవరం, తిరుపతి ఎయిర్పోర్టులలో మాత్రమే అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే.. అంతర్జాతీయ విమాన రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read: నాగార్జున దారిలో నేను కూడా నడుస్తాను..భవిష్యత్తులో స్పెషల్ రోల్స్ చేస్తాను – మెగాస్టార్ చిరంజీవి