Work-life balance survey: పనిలో ఆనందం ఉంటుంది. చేస్తున్న పనిపై మమకారం పెంచుకుంటే జీవితం మరింత ఉత్సాహంగా ఉంటుంది. దీనినే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. వెనుకటి కాలంలో ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపు ఉండదులే.. అని ఓ కవి సినిమా పాటగా రూపొందించారంటే దాని అర్థం వర్క్ – లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలని.. వర్క్ – లైఫ్ బ్యాలెన్స్ బాగుంటేనే జీవితం బాగుంటుంది. కావలసినంత శారీరక శ్రమ లభిస్తుంది. అదే సమయంలో దేహం త్వరగా విశ్రాంతి కోరుకుంటుంది. అప్పుడు అన్ని సమయానుకూలంగా జరిగిపోతాయి. ఉదాహరణకు ఉదయం ఎనిమిది గంటలకి అల్పాహారం.. మధ్యాహ్నం 12 గంటలకి భోజనం.. మూడు గంటలకు ఏదో ఒక చిరు తిండి.. రాత్రి 7 గంటలకి మితంగా ఆహారం లేదా ఇంకా ఏదైనా పదార్థం ఇలా తీసుకుంటూ ఉంటే జీవితంలో ఎటువంటి రోగాలు దరి చేరవు. అలాగే 8 గంటల పని.. అది కూడా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ చేస్తే శరీరం అలసటకు గురవుతుంది. తీసుకున్న కేలరీలు ఖర్చవుతాయి. అలాంటప్పుడు ఎటువంటి అనారోగ్యాలు దరి చేరవు. ఈ సిద్ధాంతాన్ని న్యూజిలాండ్ దేశస్తులు పాటిస్తున్నారు. అందువల్లే వారు ఆరోగ్యంగా ఉంటున్నారు.
న్యూజిలాండ్ దేశస్థుల దినచర్య ఒక టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. అక్కడ సాధ్యమైనంతవరకు నైట్ షిఫ్టులు ఉండవు. ఒకవేళ ఉన్నప్పటికీ అవి ఒక క్రమ పద్ధతి ప్రకారం జరిగిపోతుంటాయి. పగటిపూట మాత్రం అక్కడ ప్రజలు తమ పనుల్లో నిమగ్నమైపోతుంటారు. పనికి ప్రాధాన్యమిస్తూనే.. వ్యక్తిగత జీవితానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అందువల్లే వారు వర్క్ – లైఫ్ ను బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. దీంతో ఒత్తిడి నుంచి.. అనారోగ్య సమస్యలకు వారు దూరంగా ఉంటున్నారు. ఇటీవల సంస్థ నిర్వహించిన సర్వేలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో న్యూజిలాండ్ మూడోసారీ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. సంస్థ నిర్వహించిన సర్వేలో 86.87/100 స్కోరు సాధించింది. ఇక మొదటి ఐదు స్థానాలలో ఐర్లాండ్, బెల్జియం, జర్మనీ, నార్వే కొనసాగుతున్నాయి. ఈ జాబితాలో ఇండియా 42వ స్థానంలో ఉంది.
ఐచ్చిక సెలవులు, హ్యాపీనెస్, ప్రసూతి సెలవులు, ఆరోగ్య జీవిత ప్రయోజనాలు వంటి విభాగాలలో న్యూజిలాండ్ దేశం అద్భుతమైన పురోగతిని సాధించింది. ద్వారా మొదటి స్థానాన్ని ఆక్రమించింది.. న్యూజిలాండ్ దేశంలో లింగసమానత్వం ఉంటుంది. పని చేసే చోట ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు అన్ని ప్రయోజనాలు సంస్థలు కల్పిస్తాయి. ప్రైవేట్ కంపెనీలు కూడా అదే స్థాయిలో ప్రయోజనాలను అందిస్తుంటాయి. అందువల్ల ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేస్తుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా అక్కడి ప్రజలు సంతృప్తికరమైన జీవితాన్ని జీవించడానికి అలవాటు పడ్డారు.. అందువల్లే ఆదేశం ఈ స్థాయిలో ఉత్తమ ఫలితాలను సాధిస్తోంది.
ఇక మనదేశంలో ప్రవేట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటాయి. ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లో దీర్ఘమైన వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. ప్రయోజనాల విషయంలోనూ అదే వివక్ష కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల ఉద్యోగులు ఒత్తిడికి గురవుతుంటారు. తద్వారా పనిచేస్తున్న సంస్థ పై ఆగ్రహంతో.. విపరీతమైన కోపంతో ఉంటారు. దీనివల్ల వర్క్ లైఫ్ అనేది బ్యాలెన్స్ కాదు. దీంతో ఉద్యోగులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇంటి సమస్యలు.. ఆర్థికపరమైన సమస్యలు.. సంస్థలో సక్రమంగా వేతనాలు లేకపోవడం వంటివి ఉద్యోగుల వర్క్ లైఫ్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అందువల్లే భారత్ ఏకంగా 42వ స్థానానికి పడిపోయింది. భారత్ టాప్ లో ఉండాలంటే కచ్చితంగా సంస్కరణలు జరగాలి. అని ఆ సంస్కరణలను అమలు చేయడానికి ప్రైవేట్ సంస్థలు ముందుకు రావు. ముందుకు వచ్చే అవకాశం కూడా లేదు.