https://oktelugu.com/

Husband: కట్టుకున్న భార్యపై అనుమానం.. ఈ భర్త ఏం చేశాడో తెలుసా?

Husband: కాపురం చేసే కల కాలు తొక్కే నాడే తెలుస్తుంది అంటారు. దంపతుల మధ్య ఒకరిపై మరొకరికి ఆప్యాయత, అనురాగాలు ఉండాలే కానీ అనుమానమనే పెనుభూతం రాకూడదు. ఒకవేళ అనుమానం వచ్చిందంటే దాన్ని మొదట్లోనే తుంచి వేయాలి. లేకపోతే అది పెరిగి పెద్దదై చివరకు సంసారాన్ని సమస్యల మయం చేస్తుంది. ప్రపంచంలోనే ఎన్నో కేసులు అనుమానంతోనే రగులుతున్నాయి. దీంతో పండంటి కాపురాలు పనికి రాకుండా పోతున్నాయి. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన పిల్లలు దిక్కులేని వారవుతున్నారు. ప్రేమకు నమ్మకమే పునాది.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 18, 2022 / 11:07 AM IST

    Husband

    Follow us on

    Husband: కాపురం చేసే కల కాలు తొక్కే నాడే తెలుస్తుంది అంటారు. దంపతుల మధ్య ఒకరిపై మరొకరికి ఆప్యాయత, అనురాగాలు ఉండాలే కానీ అనుమానమనే పెనుభూతం రాకూడదు. ఒకవేళ అనుమానం వచ్చిందంటే దాన్ని మొదట్లోనే తుంచి వేయాలి. లేకపోతే అది పెరిగి పెద్దదై చివరకు సంసారాన్ని సమస్యల మయం చేస్తుంది. ప్రపంచంలోనే ఎన్నో కేసులు అనుమానంతోనే రగులుతున్నాయి. దీంతో పండంటి కాపురాలు పనికి రాకుండా పోతున్నాయి. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన పిల్లలు దిక్కులేని వారవుతున్నారు.

    Husband

    ప్రేమకు నమ్మకమే పునాది.. అనుమానమే సమాధి. ఒకసారి మనిషిపై అనుమానం కలిగిందంటే ఇక అంతే సంగతి. అది వారి అంతంతోనే ముగుస్తుంది. పచ్చని సంసారంలో చిచ్చులు రేపే అనుమానమే భూతాలు కోకొల్లలు. దీంతో సంసారాలు కాలిపోతున్నాయి. విశ్వాసాలు తూలిపోతున్నాయి. ఫలితంగా కన్న బిడ్డలు అనాథలుగా మారిపోతున్నారు. క్షణికావేశంలో చేసిన పనికి జీవితాంతం కుమిలిపోతున్నారు. కట్టుకున్న వారినే కడతేరుస్తూ భవిష్యత్ అంధకారం చేసుకుంటున్నారు. నూరేళ్ల జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. దీంతో తమలోని కర్కశత్వాన్ని బయటపెడుతున్నారు.

    Husband:

    ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన చంద్రశేఖర్, వనజ దంపతులు. వీరు బతుకుదెరువు రీత్యా తిమ్మాపురంలో ఉండేవారు. వారికి పదమూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారి సంసారానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సాఫీగా సాగుతున్న వారి సంసారంలో అనుమానమే పెనుభూతం ఆవహించింది. దీంతో ఇద్దరి మధ్య రోజూ గొడవలే. నువ్వు వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకున్నావని వేధించేవాడు.

    Also Read: అందమే ఆమె పాలిట శాపం.. కట్టుకున్న భార్యను భర్త ఏం చేశాడంటే?

    ఈనేపథ్యంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. శనివారం రాత్రి కూడా ఇదే విషయంపై మరోమారు రగడ రేగింది. దీంతో కోపోద్రిక్తుడైన చంద్రశేఖర్ కత్తితో భార్యను పొడిచి చంపాడు. తరువాత తను ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు చంద్రశేఖర్ ను పుత్తూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భార్య మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం తరలించారు.

    ప్రస్తుతం ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. తల్లిదండ్రుల క్షణికావేశంతో కుటుంబం అగాధంలో పడింది. పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. తాము చేసుకున్న నేరానికి వారు శిక్ష అనుభవించే పరిస్థితి ఏర్పడింది. దంపతుల మధ్య విశ్వాసం ఉండాలే కానీ అనుమానం ఉండకూడదు. ఉంటే ఇలా విగతజీవులుగా మారి పిల్లలకు తోడు లేకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా చర్చించుకుని తేల్చుకోవాలే కానీ ఇలా చేస్తే వారి సంసారమే కకావికలం అవుతుంది. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. అదేంటో వెతికి పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది.

    Also Read: అందమే ఆమె పాలిట శాపం.. కట్టుకున్న భార్యను భర్త ఏం చేశాడంటే?

    Tags