Constipation: మలబద్ధకం సమస్యకు ఈ చిట్కాలతో చెక్ పెట్టండి..

మలబద్ధకం సమస్య ఉన్నవారికి ప్రతిరోజూ ఉదయం నరకంలా అనిపిస్తుంది. అయితే ఈ సమస్యతో బాధపడేవారు రకరకాల మెడిసిన్ వాడుతూ ఉంటారు. కొందరు మెడిసిన్ తీసుకున్నా.

Written By: Chai Muchhata, Updated On : September 22, 2023 8:53 am

Constipation

Follow us on

Constipation: మార్కెట్లో రుచికరమైన ఆహార పదార్థాలు ఇప్పుడు చాలా దొరుకుతాయి. దీంతో కొంత మంది ఇంట్లో కంటే బయట ఫుడ్ కు బాగా అలవాటయ్యారు. ఇలా ఔట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్న వారిలో అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హోటల్ నిర్వాహకులు నాణ్యమైన నూనెతో పాటు ఆహార పదార్థాలు వాడే అవకాశం ఉండకపోవచ్చు. ఈ క్రమంలో మలబద్ధకం సమస్యకు కూడా దారి తీయొచ్చు. ఇప్పుడున్న వారిలో చాలా మంది మలబద్ధకం సమస్యతో మాధపడుతున్నారు. ప్రతీరోజూ వీరికి ఫ్రీ మోషన్ లేకపోవడంతో కడుపు ఉబ్బరంగా ఉండడంతో పాటు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఇలాంటి సమస్య ఉన్నవారు. ఈ టిప్స్ ఫాలో అయితే మెడిసిన్ వాడే అవసరం ఉండకపోవచ్చు.

మలబద్ధకం సమస్య ఉన్నవారికి ప్రతిరోజూ ఉదయం నరకంలా అనిపిస్తుంది. అయితే ఈ సమస్యతో బాధపడేవారు రకరకాల మెడిసిన్ వాడుతూ ఉంటారు. కొందరు మెడిసిన్ తీసుకున్నా.. ఆరోగ్య పద్ధతులు ఫాలో కాకపోవడం వల్ల అవి ఫలితాలను ఇవ్వవు. అంతేకాకుండా కొందరికి మెడిసిన్ పడక ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఇంట్లోనే కొన్ని టిప్స్ పాటించడం వల్ల మలబద్ధకం సమస్యను దూరం చేయొచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే?

ప్రతిరోజూ ఉదయం లేవగానే ద్రవపదార్థాలు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి. అంటే పరగడుపున అరలీటర్ వరకు వేడి నీటిని తీసుకోవాలి. లేదా మూడు గ్లాసుల మజ్జిక తీసుకోవాలి. ఉదయం నుంచి రాత్ర వరకు ద్రవరూపంలో ఉండే వాటినే తీసుకోవాలి. సాధారణంగా రోజూ తినే ఆహారంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అలా వాటి జోలికి పోకుండా పీచు పదార్థాలు ఉండేవాటిని తీసుకోవడం మంచింది. వీటిల్లో బెల్లం పొడి ఒకటి. బెల్లంపొడిని, నెయ్యితో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది. దీంతో జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. మధ్యాహ్నం అన్నం తిన్న తరువాత కూడా ఈ మిశ్రమాన్నితీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు బయటకు పోతుంది.

రాత్రి ఫుడ్ కోసం రైస్, చపాతీలు కాకుండా ఫ్రూట్స్ తీసుకోవాలి. వీటిలో పుచ్చకాయ, దోసకాయ లాంటి నీటి నిల్వలు ఉండే పండ్లను తినాలి. ఇవి తినడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా మారి శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. రాత్రి అన్నం తప్పనిసరిగా తినేవారు ఇందులో నువ్వుల పొడిని వేసుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది.