Mutual Funds: దేశంలో చాలామంది డబ్బును ఆదా చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ మొత్తం కాకుండా తక్కువ మొత్తం పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తులో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ విధానంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పవచ్చు. గత 25 సంవత్సరాలలో మ్యూచువల్ ఫండ్స్ అద్భుతమైన లాభాలను ఇచ్చాయి.
నెలకు 600 రూపాయల చొప్పున 40 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడిపై కనీసం 15 శాతం రాబడిని పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తే 40 సంవత్సరాల తర్వాత కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. 40 సంవత్సరాలలో పెట్టుబడి 2,88,000 రూపాయలు కాగా రాబడి మాత్రం కళ్లు చెదిరే స్థాయిలో ఉంటుంది. నెలకు 900 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మరింత ఎక్కువ మొత్తం లభిస్తుంది.
Also Read: ఈసీఐఎల్ హైదరాబాద్‌లో 300 జాబ్స్.. రూ.25 వేల వేతనంతో?
మార్కెట్ అడ్వైజర్ సహాయంతో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నష్టపోయే అవకాశాలు అయితే తగ్గుతాయని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు కాంపౌండింగ్ ప్రయోజనాలను పొందే ఛాన్స్ ఉంటుంది. చిన్న వయస్సులోనే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే ఎక్కువ మొత్తం లాభాలను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
పెట్టుబడిని ఎక్కువ సంవత్సరాలు ఉంచితే ఎక్కువ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. 20 లేదా 25 సంవత్సరాల పాటు డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా కష్ట కాలంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: ఎస్బీఐలో పర్సనల్ లోన్ కావాలా.. ఆన్ లైన్ లో సులభంగా లోన్ పొందే ఛాన్స్!