https://oktelugu.com/

Naga Shourya: ఫుల్ ఫామ్ లో వరుస సినిమాలు చేస్తున్న నాగ శౌర్య… డబ్బింగ్ పనుల్లో మరో చిత్రం

Naga Shourya: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతున్న నటుల్లో యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఒకరు. కెరీర్ పరంగా శౌర్య ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను, లక్ష్య’ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్‌ రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం నాగ శౌర్య ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ తో పాటు సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లోనూ ఓ మూవీ చేస్తున్నాడు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 09:37 AM IST
    Follow us on

    Naga Shourya: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతున్న నటుల్లో యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఒకరు. కెరీర్ పరంగా శౌర్య ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను, లక్ష్య’ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్‌ రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం నాగ శౌర్య ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ తో పాటు సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లోనూ ఓ మూవీ చేస్తున్నాడు. షీర్లే సేతియా హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాను అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. సీనియర్‌ హీరోయిన్‌ రాధిక ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీకి ఇంకా పేరు ఖరారు చేయలేదు.

    naga shourya new movie under aneesh krishna started dubbing work

    Also Read: ‘రారా సామీ’ స్టెప్పులతో ఇన్​స్టాలో రష్మిక వీడియో పోస్ట్​.. లక్షల్లో లైక్​లు

    అయితే ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డబ్బింగ్‌ కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఈ సర్‌ప్రైజింగ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ‘వెన్నెల’ కిశోర్, రాహుల్‌ రామకృష్ణ, సత్య కామెడీ హీలేరియస్‌గా ఉండ‌బోతోందని తెలుస్తోంది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్‌ ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. కాగా నాగ శౌర్య నటించిన చివరి చిత్రం లక్ష్య… సంతోష్‌ జాగర్లపూడి దర‍్శకత్వంలో తెరకెక్కించారు. నాగశౌర్య సరసన అందాల బ్యూటీ కేతిక శర్మ జంటగా నటించింది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై… నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, సచిన్ ఖేదేఖర్ లు కీలక పాత్రల్లో నటించగా… కాల భైరవ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. మరి ఈ సినిమా అయిన నాగ శౌర్య కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

    Also Read: నాగిని పాటకు స్టెప్పులు ఇరగదీసిన నటి ప్రగతి… ఫిదా అవుతున్న కుర్రకారు