Chanakya Niti: సంతోషంగా ఉండాలంటే ఇవి చేయాల్సిందే..

గొప్ప పనులు చేసే వ్యక్తి గొప్పగా మారుతాడు. అందుకే ఏ పని చేసే ముందు అయినా ధృడమైన లక్ష్యం అవసరం అని సూచించారు చాణక్యుడు. దీపం చిన్నదే కానీ చీకటిని పారద్రోలుతుంది. కానీ చీకటి కంటే దీపం పెద్దది కాదని మాత్రం గుర్తుపెట్టుకోవాలి.

Written By: Swathi, Updated On : March 30, 2024 1:45 pm

Chanakya Niti

Follow us on

Chanakya Niti: ఎంత సంపాదించినా, ఎన్ని కష్టాలు పడిన సంతోషం కోసమే ప్రతి ఒక్కరి తాపత్రయం. కానీ ఈ సంతోషాన్ని కాదనుకొని ఎలాంటి పనులు చేసినా కష్టాలు తప్ప ఏం మిగలవు. అయితే డబ్బు డబ్బు అంటూ డబ్బు వెనుక ఎంత పాకులాడిన చివరకు సంతోషంగా ఉండాలని అనుకుంటారు. మరి ఈ సంతోషం కోసం ఏం చేయాలో ఆచార్య చాణక్యుడు వివరించారు. ఆయన చెప్పిన మాటలు తూ.చ తప్పకుండా పాటించే వారు ఎందరో ఉంటారు. ఇంతకీ సంతోషం కోసం చాణక్యుడు ఏం చెప్పారంటే..

మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిని ఎప్పుడు కూడా మోసం చేయకూడదు. ఇలాంటి పనులు చేసేవారు వారు తవ్వుకున్న గోతిలో వారే పడతారు. మిమ్మల్ని ఇష్టపడే వారితో విధేయతతో ఉంటే ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని వారు కాపాడతారు అని గుర్తు పెట్టుకోండి.

గొప్ప పనులు చేసే వ్యక్తి గొప్పగా మారుతాడు. అందుకే ఏ పని చేసే ముందు అయినా ధృడమైన లక్ష్యం అవసరం అని సూచించారు చాణక్యుడు. దీపం చిన్నదే కానీ చీకటిని పారద్రోలుతుంది. కానీ చీకటి కంటే దీపం పెద్దది కాదని మాత్రం గుర్తుపెట్టుకోవాలి.

ఎంత సంపాదిస్తే అందులో కొంత భాగం దానం చేయాలి. తన గురించి మాత్రమే ఆలోచించుకునే వ్యక్తి చివరకు ఒంటిరిగా మిగులుతాడు. తేనేటీగలు తేనెను సేకరించి ఇతరులకు పెడుతాయి. కానీ వాటికి ఏం మిగలవు. చివరకు ఇతరుల గురించి ఆలోచించని మనుషుల పరిస్థితి కూడా అలాగే అవుతుంది.

పెద్దల పట్ల వినయం, మంచి వ్యక్తుల పట్ల ప్రేమ, శుత్రువు ముందు ధైర్యంగా ఉండటం ఉత్తమం. అని వివరించారు చాణక్యుడు. మరి తెలుసుకున్నారు కదా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో.. ఇప్పటి నుంచి అయినా వీటిని పాటించండి. సంతోషంగా ఉండండి.