Siddu Jonnalagadda: సిద్ధూ జొన్నలగడ్డ టైం స్టార్ట్ అయిన సూచనలు కనిపిస్తున్నాయి. మనోడు టైర్ టు హీరోల జాబితాలో అడుగుపెట్టేశాడు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలు సిద్ధూ జొన్నలగడ్డకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన డీజే టిల్లు భారీ వసూళ్లు రాబట్టింది. నిర్మాతలకు పెద్ద మొత్తంలో లాభాలు పంచింది. ఈ క్రమంలో డీజే టిల్లు కి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అదే స్థాయిలో వసూళ్ళు ఉన్నాయి.
విశేషం ఏమిటంటే… టిల్లు స్క్వేర్ క్రేజ్ యూఎస్ లో ఓ రేంజ్ లో ఉంది. ఎంతగా అంటే విజయ్ దేవరకొండ సినిమా టికెట్ ప్రైస్ ని కూడా బీట్ చేసేలా. టిల్లు స్క్వేర్ ప్రీమియర్ టికెట్ ధర $ 18 డాలర్లు. శుక్రవారానికి $ 15 డాలర్లకు తగ్గింది. అదే సమయంలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ప్రీమియర్ టికెట్ ధర $15 డాలర్లు మాత్రమే. దీంతో విజయ్ దేవరకొండను సిద్ధూ జొన్నలగడ్డ బీట్ చేశాడని అంటున్నారు.
పరశురామ్-విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదలయ్యే వరకు టిల్లు స్క్వేర్ చిత్రానికి పోటీ లేదు. టిల్లు స్క్వేర్ రూ. 100 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత నాగవంశీ ఆశాభావం వ్యక్తం చేశాడు. టిల్లు స్క్వేర్ జోరు చూస్తుంటే ఆ ఫిగర్ చేరుకోవడం పెద్ద కష్టం ఏమీ లేదు అన్నట్లుగా ఉంది. యూఎస్ లో టిల్లు స్క్వేర్ $ 1 మిలియన్ వసూళ్లకు చేరువైంది. ప్రీమియర్స్ ద్వారానే $350000 రాబట్టింది.
టిల్లు స్క్వేర్ మూవీలో సిద్ధూ జొన్నలగడ్డకు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. గతంలో ఎన్నడూ చేయని గ్లామరస్ రోల్ చేసింది. లిల్లీగా అలరించింది. అనుపమ హద్దులు చెరిపేసి నటించిన నేపథ్యంలో ఒకింత విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఎప్పుడూ ఒకే తరహా రోల్స్ చేస్తుంటే బోర్ కొడుతుంది. అందుకే ఈ తరహా పాత్ర చేశానని అనుపమ పరమేశ్వరన్ అన్నారు.