Chanakya Niti: ప్రతి విషయం గురించి చాణక్యుడు ఎంతో అద్భుతంగా వివరించారు. ఈయన తెలిపిన విషయాలను తూ.చ తప్పకుండా పాటిస్తే విజయం సొంతం అవుతుంది. గెలుపును పొందాలంటే ఈయనను అనుసరించవచ్చు అంటారు కొందరు. అయితే ఆచార్య చాణక్యుడు కొన్ని పనులు చేయడానికి సిగ్గు పడకూడదు అని వివరించారు. మరి ఎలాంటి విషయాల్లో సిగ్గు పడకూడదు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డబ్బు విషయంలో.. డబ్బు విషయంలో సిగ్గు పడితే నష్టపోయేది మీరు అని గుర్తుపెట్టుకోండి. ఎవరికి అయినా అప్పు ఇచ్చి తిరిగి ఆ డబ్బులు అడగడానికి సిగ్గు పడితే నష్టపోయేది మీరే. అందుకే డబ్బు విషయంలో అసలు సిగ్గు పడకండి. దీని వల్ల ధన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మంది ఇలాంటి విషయాల వల్లనే డబ్బు కోల్పోతుంటారు. పోనీలే అని వదిలేస్తారు. కానీ ఇలాంటి మనస్తత్వం కూడా నష్టాన్ని సంపాదించి పెడుతుంది. అందుకే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ఆకలి.. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం ఆకలి విషయంలో కూడా సిగ్గు పడకూడదు. ఆకలి విషయంలో సిగ్గు పడితే పస్తులు ఉండాల్సి వస్తుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎవరి ఇంటికి అయినా అతిథిగా వెళ్తే వారు తినమని అంటారు. మొహమాటానికి వద్దు అంటే అప్పుడు మీరే ఆకలితో అలమటిస్తారు. సగం తిని కూడా చాలు అనకండి. దీనివల్ల కూడా నష్టపోయేది మీరే. అందుకే ఆకలి విషయంలో సిగ్గు పడకూడదు.
జ్ఞానం.. జ్ఞానం సంపాదించే విషయంలో కూడా సిగ్గుపడకూడదు అంటారు చాణక్యుడు. గురువు నుంచి ప్రశ్నలు అడగాలన్నా, సమాధానాలు వెతుక్కోవాలి అన్నా సిగ్గు పడకపోవడమే బెటర్. ఉపాధ్యాయుని దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా సిగ్గపడకూడదు. లేదంటే మీరు ముందుకు వెళ్లలేరు.