https://oktelugu.com/

Vastu Tips: తలదగ్గర ఈ వస్తువులను పెట్టుకొని పడుకుంటున్నారా?

పర్సులను తల దగ్గర పెట్టుకోకూడదు అంటున్నారు వాస్తు నిపుణులు. ఇలా చేయడం వల్ల అనవసర ఖర్చులు ఎక్కువగా అవుతాయట. పర్సులు, డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో కూడా తలదగ్గర పెట్టుకొని పడుకోకూడదు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 6, 2024 / 04:19 PM IST

    Vastu Tips

    Follow us on

    Vastu Tips: ఇంటికి మాత్రమే కాదు ఇంట్లో ఏర్పాటు చేసుకునే కొన్ని వస్తువులకు కూడా వాస్తు చూడాల్సిందే. వాస్తుకు అనుగుణంగానే వ్యవహరించాలి. లేదంటే ఆ ఇంట్లో చాలా సమస్యలు వస్తాయి అంటారు పండితులు. అయితే నిద్రపోయే భంగిమ దగ్గర నుంచి నిద్రపోయే సమయంలో పక్కన పెట్టుకునే వస్తువల వరకు వాస్తు ప్రభావితం చేస్తుంది. ఇంతకీ మీరు పడుకునేటప్పుడు మీ పక్కన ఎలాంటి వస్తువులను ఉంచుతున్నారు. దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా? అయితే ఓసారి లుక్ వేయండి.

    పర్సులను తల దగ్గర పెట్టుకోకూడదు అంటున్నారు వాస్తు నిపుణులు. ఇలా చేయడం వల్ల అనవసర ఖర్చులు ఎక్కువగా అవుతాయట. పర్సులు, డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో కూడా తలదగ్గర పెట్టుకొని పడుకోకూడదు.

    కొందరు మహిళలు తల దగ్గర ధరించిన నగలను, గొలుసులను, ఆభరణాలను పెట్టుకొని మరీ నిద్రపోతారు. దీనివల్ల ఆర్థక నష్టాలు ఎదుర్కొనే సమస్యలు వస్తాయట. ఇలా చేయడం ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే పడుకునే ముందు మీ అభరణాలను ధరించండి, లేదా దూరంగా పెట్టుకొని పడుకోండి.

    రాత్రి పడుకునే సమయంలో పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు పక్కన పుస్తకం పెట్టుకొని పడుకుంటారు. ఇలా చేయడం వల్ల తెలియని అలజడితో పాటు జీవితంలో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే తల దగ్గర పుస్తకాలను పెట్టుకోకపోవడమే మంచిది.

    పడుకునే సమయంలో వాటర్ బాటిల్స్ ను కూడా తల దగ్గర పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందట. అందుకే వాటర్ ను కాస్త దూరంగా పెట్టి పడుకోవడమే ఉత్తమం అంటున్నారు వాస్తు నిపుణులు.

    స్మార్ట్ ఫోన్లను తల దగ్గర పెట్టుకొని పడుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లను తల దగ్గరపెట్టుకొని పడుకోవడం అలవాటే. వాస్తు ప్రకారం కాకపోయినా సైన్స్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఫోన్ ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ప్రమాదమే.