Shiva And Parvati: భార్యాభర్తల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకరికోసం ఒకరు జీవితాంతం కష్టాలు ఎదురైనా ఎన్ని నష్టాలు సంభవించినా కూడా కలిసిమెలిసి ఉంటారు. ఇద్దరి మధ్య కొన్ని గొడవలు రావడం కామన్ కానీ వాటి వల్ల విడిపోవడం కరెక్ట్ కాదు. ఒక మనిషి గురించి తెలియకుండా పెళ్లి అనే బంధం తో ఇద్దరు కూడా కలిసి జీవిస్తారు. మరి ఇలాంటి బంధాలే ఇప్పుడు చిన్న చిన్న గొడవలకు విడిపోతున్నారు. ఇంతకీ దాంపత్యంలో ఉన్న గొప్పతనం గురించి తెలుసుకుంటే ఎంత పెద్ద గొడవ అయినా చిన్నగానే కనిపిస్తుంటుంది.
శివపార్వతులను గమనిస్తే వారి దాంపత్యం గురించి తెలుసుకుంటే జీవితంలో విడిపోవాలి అనే ఆలోచన రాదు. శివానీ, భవానీ ఈ పేర్లను గమనించారా. శివయ్యలో సగం పేరు, భవానీలో సగం పేరు భవా. ఇలా ఆ పార్వతీదేవి తన పేరుకు ముందు శివయ్య పేరునే జోడించుకుంటుంది. శిక పక్కన ఆనీ చేరిస్తే శివానీ, భవ పక్కన ఆనీ చేరిస్తే భవానీ.మరో పేరు కూడా ఉంది. అదే శర్వా అంటే శర్వాణీ కూడా. ఈ మూడు పేర్లు ఆ పార్వీతీ దేవి పేర్లే. చూశారా అన్ని పేర్లలో కూడా శివుడి పేరు ఉంది.
ఆ పరమేశ్వరుడు అర్దనారీశ్వరుడే కాదు..పార్వతీదేవి పేరులో కూడా ఉన్నాడు. ఆ పార్వతీదేవీ ఒక సందర్భంలో అంటుందట నాకు వేరే పేరు ఎందుకండీ ఆయన భార్య అంటే చాలు అని.. అందుకే గుడికి వెళ్తే అర్చన చేసుకునే సమయంలో నా పేరు చెప్పు అని పీడించాల్సిన అవసరం కూడా లేదు. కేవలం భర్త పేరు చెప్పి ఆ తర్వాత ఆయన భార్య అన్న కూడా సరిపోతుంది. అందుకే ఇంత గొప్పతనం ఉన్న భార్యాభర్తల బంధంలో చిన్నచిన్న సమస్యలకు దూరం అవడం, గొడవలు పడటం ఎందుకు?
ఇంటి పేరును జోడించుకుంటారు కానీ భర్త పేరును జోడించుకునే అదృష్టం కేవలం భార్యకు మాత్రమే ఉంటుంది. అంటే నీలో సగం నేను అని పేరుతో కూడా చెప్పినట్టే. ఆ పార్వతీ దేవి శరీరంలోనూ, పేరులోనూ ఉంటుంది. అందుకే చాలా సందర్బాల్లో శివపార్వతులు అనే సంభోదిస్తారు కానీ విడదీసి పలకరు. మరి మీరు కూడా కలిసిమెలిసి హాయిగా ఉండండి సుమ.