Chanakya Niti : సహాయం, చిరునవ్వు పరిమళం లాంటివి. మనం దానిని ఇతరులపై ఎంత ఎక్కువగా పంచుకుంటే, మన జీవితం అంత సువాసనగా అంటే అందంగా ఉంటుందని ఆచార్య చాణక్యుడు అన్నారు. ప్రతి వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటాడు. కానీ మనిషి చుట్టూ అనేక భ్రమలు ఉంటాయి. దాని ఉచ్చు నుంచి బయటపడిన వారు ఎప్పుడూ దుఃఖాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.. పరిస్థితులు అన్ని వేళలా ఒకేలా ఉండవు. ఉండకూడదు కూడా. మార్పు చాలా ముఖ్యం. అప్పుడే పరిస్థితి మెరుగుపడుతుంది. చాణక్య నీతి సంతోషకరమైన జీవితానికి మూడు ప్రాథమిక మంత్రాలను అందిస్తుంది. మరి అదేంటో తెలుసుకుందామా.
సంతోషకరమైన జీవితానికి సంతృప్తి మొదటి మెట్టు
ఆచార్య చాణక్యుడి ప్రకారం, సంతోషకరమైన జీవితానికి మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి. మొదటి సంతృప్తి, రెండవది ఆరోగ్యం, మూడవది నమ్మకం. సంతృప్తి అనేది ఆనందానికి పర్యాయపదం. ప్రతి పరిస్థితిలోనూ సంతృప్తిగా ఉండే వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. అలాంటి వారి జీవితాల్లోకి ఆనందం తొంగి చూస్తుంది. ఇక సంతృప్తి చెందని వ్యక్తి వెంట సమస్యలు వస్తూనే ఉంటాయి. సానుకూల ఆలోచనతో సమస్యలను ఎదుర్కొనే వారు ఖచ్చితంగా విజయం పొందుతారు. ఇతరుల ఆనందంలో మీ ఆనందాన్ని చూడటానికి ప్రయత్నించండి. దీనివల్ల మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు. మీరు సంతోషంగా ఉంటే, ఇతరులకు కూడా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు.
Also Read : చాణక్య నీతి: అదృష్టవంతుల లక్షణాలు ఇవే..
మంచి ఆరోగ్యం సంతోషకరమైన జీవితానికి సంకేతం
మంచి ఆరోగ్యమే మానవ జీవితానికి మూలధనం. రోజువారీ వ్యాయామం, సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితానికి రహస్యం. చాణక్యుడి ప్రకారం, ఆరోగ్యంగా లేని వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడు. అతని జీవితం గొడవలు, ఇబ్బందులు, సమస్యలతో నిండి ఉంటుంది. ఈ పోరాటంలో అతను ఆనందాన్ని ఆస్వాదించలేడు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు.
నమ్మకం
ఆత్మవిశ్వాసం అనేది ఒక మంచి లక్షణం. దాని సహాయంతో పెద్ద పనులను సులభంగా సాధించవచ్చు. మీ మీద మీకు నమ్మకం ఉంటే, వైఫల్య భయం మిమ్మల్ని ఎప్పటికీ వెంటాడదు. మీ చర్యలు, నిజాయితీని నమ్మండి. ఒక వ్యక్తి తన సమస్యలు ముగిసే వరకు వేచి ఉంటే, అతని జీవితం నిలిచిపోయిన నీటిలా అవుతుంది. అది కుళ్ళిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, కష్టాలను ఎలా అధిగమించాలో ఆలోచించండి.