Director Vikram Sukumaran: తమిళ నటుడు, డైరెక్టర్ విక్రమ్ సుకుమారన్ కన్నుమూశారు. ఓ ప్రాజెక్టు కోసం ముధురై నుంచి చెన్నైకి వెళ్తుండగా గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోపు మరణించారు. కెరీర్ ఆరంభంలో బాలు మహేంద్ర దగ్గర విక్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. పొల్లాధవన్, కోవీరన్ చిత్రల్లో నటించారు. ధనుష్ హిట్ మూవీ ఆడుకాలం కు రైటర్ గా పనిచేశారు. హీరో శంతునుతో మదయానై కొట్టం, రావణ కొట్టం మూవీలకు డైరెక్షన్ చేశాడు.