MI vs PBKS Qualifier 2 : బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో అయ్యర్ సేనకంటే పాండ్యా జట్టు అత్యంత బలమైనది. పైగా ఈ ఐపీఎల్లో వరుసగా విజయాలు సాధించుకుంటూ వచ్చి క్వాలిఫైయర్ -2 దాకా ముంబై వచ్చింది. ముఖ్యంగా ఎలిమినేటర్ మ్యాచ్లో దుమ్మురేపి.. గిల్ సేనకు చుక్కలు చూపించింది. దీనికంటే ముందు క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో అయ్యర్ సేన దారుణంగా ఇబ్బంది పడింది. అత్యంత తక్కువ పరుగులు చేసి కన్నడ జట్టు ఎదుట తలవంచింది. దీంతో క్వాలిఫైయర్ -2 లో అయ్యర్ జట్టుకు ఓటమి తప్పదని.. హార్దిక్ సేనకు విజయం దక్కుతుందని అందరూ అంచనా వేశారు. చివరికి గూగుల్ ప్రిడిక్షన్ కూడా హార్దిక్ సేన వైపే మొగ్గు చూపించింది. అయితే కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న అయ్యర్ సేన.. చివరి వరకు హార్దిక్ జట్టుతో పోటీపడింది. అన్ని విభాగాలలో సత్తా చాటి.. బలమైన హార్దిక్ జట్టును నేల కరిపించింది. తద్వారా ఫైనల్ వెళ్లిపోయి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఒకానొక దశలో గెలిచే విధంగా కనిపించిన హార్దిక్ సేన.. అనవసరమైన తప్పులు చేసి ఓటమిపాలైంది.. ముఖ్యంగా అయ్యర్ ఫామ్ ను అంచనా వేయలేకపోయింది. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బందికరమైన బంతులు వేయలేకపోయింది. ఫలితంగా అతడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ప్రారంభంలో నిదానంగా ఆడిన అయ్యర్.. ఆ తర్వాత దుమ్ము రేపే రేంజ్ లో బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా అశ్విని కుమార్ బౌలింగ్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. దీనికి తోడు కీలక దశలో అత్యుత్తమ భాగస్వామ్యాలు నెలకొల్పి ముంబై జట్టు మీద అయ్యర్ తీవ్రమైన ఒత్తిడి నెలకొల్పాడు. అయ్యర్ పాతుకుయిన తర్వాత.. హార్దిక్ మాత్రం తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయాడు. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడ్డాడు. మరోవైపు అతనికి పటిష్టమైన సలహాలు ఇచ్చేవారు మైదానంలో కరువయ్యారు.
బ్యాటింగ్లో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. వాస్తవంగా అతని నుంచి మెరుగైన ఇన్నింగ్స్ గనుక నమోదయి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. గిల్ సేనతో సాగిన మ్యాచ్లో దుమ్మురేపిన రోహిత్.. అయ్యర్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రం విఫలమయ్యాడు. దీంతో ముంబై జట్టుకు ఊహించిన స్థాయిలో తొలి వికెట్ బాగా స్వామ్యం నమోదు కాలేక పోయింది.
Also Read: ఆపరేషన్ సిందూర్: కూలిన భారత ఫైటర్ జెట్స్.. గోప్యత ఎందుకు?
మరోవైపు బుమ్రా ధారాళంగా పరుగులు ఇచ్చాడు. వికెట్లు తీయలేకపోయాడు. కట్టుదిట్టంగా బంతులు వేయలేకపోవడంతో పంజాబ్ ప్లేయర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు.
అశ్విని కుమార్ వికెట్లు తీసినప్పటికీ.. కట్టుదిట్టంగా బంతులు వేయలేకపోయాడు. పైగా చివర్లో అతడు దారుణంగా తడబడ్డాడు. ఫలితంగా అయ్యర్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. వాస్తవానికి అశ్విని కుమార్ బంతిమీద పట్టు సాధించి ఉంటే బాగుండేది. కాకపోతే వికెట్లు తీసినప్పటికీ బంతిమీద పట్టు లేకపోవడంతో అశ్విని కుమార్ ధారాళంగా పరుగులు ఇచ్చాడు.
వైవిధ్య భరితమైన స్పిన్ బౌలర్ శాంట్నర్ కు హార్దిక్ ఎక్కువగా ఓవర్లు ఇవ్వలేదు. అతడికి రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేసే అవకాశం ఇవ్వడంతో.. పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఇన్ని తప్పులు చేయడం వల్ల హార్దిక్ సేన ఓటమిపాలైంది. అయ్యర్ సేన విజయం సాధించింది.