Chanakya Niti: అపర చాణక్యుడు రాజనీతి శాస్త్రం ద్వారా మౌర్య సామ్రాజ్యాన్ని కాపాడాడు. అలాగే మనుషుల జీవితాలకు సంబంధించిన కొన్ని విలువైన సూత్రాలు చెప్పాడు. ఈ సూత్రాలను అనాది నుంచి చాలా మంది పాటిస్తూ వస్తూ తమ జీవితాలను సార్థకం చేసుకుంటున్నారు. నేటి యువతకు చాణక్య నీతులు చాలా అవసరం అని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితం సక్రమమైన మార్గంలో వెళ్లాలంటే చాణక్య నీతిని ఫాలో కావాలని అంటుంటారు. చాణక్య నీతి ప్రకారం.. మనసుషుల మధ్య సంబంధాలు మనసుకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇంట్లో వాళ్లతోనే కాకుండా సమాజంలో చాలా మందితో కలిసి ఉండే అవకాశం ఉంటుంది. వీరితో ఎలా ప్రవర్తించాలి? వారితో ఎలా మెలగాలి? అనే విషయాలను చాణక్యుడు చెప్పాడు. ఆయన చెప్పిన సూత్రాల ప్రకారం వీరి ఇంట్లో భోజనం అస్సలు చేయకూడదట. సాధారణకంగా ఎవరైనా మర్యాదగా ఇంటికి ఆహ్వానిస్తే భోజనానికి వెళ్తారు. కానీ వీరి ఇళ్లల్లో భోజనం చేయడం వల్ల అనర్థాలు ఎదురవుతాయని చాణక్య నీతి చెబుతుంది. మరి ఎవరి ఇంట్లో భోజనం చేయకూడదు?
కొంత మంది సమాజం గురించి పెద్దగా పట్టించుకోరు. తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఈ క్రమంలో నేరాలకు పాల్పడుతూ ఉంటారు. తమ స్వార్థం కోసం మనుషులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఒక్కోసారి జైలుకు కూడా వెళ్లి వస్తారు. ఇలాంటి వారు పిలిచినా వారి ఇళ్లల్లో భోజనం చేయడానికి అస్సలు వెళ్లకూడదని చాణక్య నీతి తెలుపుతుంది. ఎందుకంటే వారి ఇంట్లో భోజనం చేయడం వల్ల వారితో స్నేహం చేసిన వారవుతారు. దీంతో మంచి వారు కూడా చెడ్డవారిగా మారిపోతారు. ఇది భవిష్యత్ లో ఎంతో ఇబ్బంది పెడుతుంది.
కొంత మంది స్త్రీలు ఎక్కువ మందితో సంబంధాలను కొనసాగిస్తారు. వీరు అందరితో కలిసి మెలిసి ఉంటూనే తప్పుడు పనులు చేస్తారు. ఇలాంటి వారు భోజనానికి పిలిస్తే వెళ్లకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే వీరి ఇళ్లల్లో భోజనానికి వెళ్లడం ద్వారా.. వెళ్లిన వారిని తప్పుడుగా చూస్తారు. అంతేకాకుండా వారితో మంచిగా ప్రవర్తించినా వారు చెడు చూపులు చూసే అవకాశం ఉంది. ఇలాంటి వారు డబ్బు కోసం ఏమైనా చేస్తారు. అందువల్ల ఇలాంటి వారికి దూరంగా ఉండడమే మంచిదని చాణక్య నీతి తెలుపుతుంది.
డబ్బు అందరికీ అవసరమే. కానీ కొందరు అక్రమంగా డబ్బును సంపాదించి సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుంటారు. ఇలాంటి వారి ఇళ్లల్లో భోజనానికి వెళ్లడం వల్ల మంచి వారు చెడ్డవారుగా మారిపోతారు. అక్రమంగా డబ్బు సంపాదించిన వారితో స్నేహం చేయడం వల్ల సమాజంలో వీరికి కూడా గౌరవం పోతుంది. అందువల్ల ఇలాంటి వారి ఇళ్లల్లో భోజనం చేయకుండా ఉండడమే మంచిదని అంటున్నారు.
కొంత మంది ఇళ్లల్లో కుటుంబ సభ్యుల్లో ఎప్పటికీ ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. వీరి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోరు. ఇలాంటి వారి ఇళ్లల్లో భోజనం చేయడం వల్ల వెళ్లిన వారికి అంటు వ్యాధులు అంటే అవకాశం ఉంది. అందువల్ల ఇలాంటి వారి ఇళ్లల్లో భోజనం చేయకుండా ఉండాలి.