Job Mela : దేశంలో నిరుద్యోగ రేటు ఏటా పెరుగుతోంది. ప్రభుత్వ కొలువులు చాలా వరకు తగ్గిపోయాయి. దీంతో ప్రైవేటు కంపెనీలకు కూడా పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో సంస్థలు ఉద్యోగల ఎంపికకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాయి. టాలెంట్ ఉన్నవారినే ఎంపిక చేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు కూడా నిరుద్యోగం తగ్గించేందుకు ప్రైవేటు సంస్థలకు రాయితీలు ఇవ్వడంతోపాటు జాబ్ మేళాల నిర్వహణకు ఉపాధి కల్పన శాఖ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు స్వచ్ఛందంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా జనగామ(Janagama) జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ(Employeement department) ముందుకు వచ్చింది. జనవరి 28న జాబ్ మేళా ఏర్పాటు చేసింది. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి మల్లయ్య ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రైవేటు సంస్థలు..
ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జాబ్ మేలా నిర్వహించనుంది. జనవరి 28న జనగామ జిల్లాలో జాబ్‌మేలా(Job Mela)నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేళాలో జ్యోతి ఎంటర్‌ప్రైజెస్, ఇన్‌స్టాలేషన్, ఆర్వో వాటర్ ప్లాంట్ ఫ్యూరిఫైయర్స్, మెయింటనెన్స్‌కు సంబంధించి ప్రైవేటు సెక్టార్‌లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
వీరు అర్హులు..
ఈ జాబ్ మేళాలో పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్ములు. వయసు 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి. ద్విచక్రవాహనం నడపగలగాలి. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఈనెల 28న జనగామ కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించే జాబ్ మేళాకు రావాలని ఉపాధి కల్పన అధికారి మల్లయ్య సూచించారు. ఇంటర్వ్యూల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుందని తెలిపారు. గతంలో కూడా జాబ్ మేళాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎంతో మంది నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.