MLA Chadalawada Arvind Babu: కొందరు ఎమ్మెల్యేల తీరు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తోంది. పనితీరు మార్చుకోవాలని చాలాసార్లు సీఎం చంద్రబాబు ( CM Chandrababu) సొంత పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరించారు. అయినా కొందరి తీరులో మార్పు రాలేదు. ఓ టిడిపి ఎమ్మెల్యే ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లి రచ్చ రచ్చ చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో నరసారావుపేట టిడిపి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనర్ ఛాంబర్ లో హల్చల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఓ డిపోలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తన జాబితా మేరకు పోస్టింగ్ ఇవ్వాలని.. ఆ తరువాతే తాను బయటకు వెళ్తానంటూ అక్కడే బైఠాయించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడినా వినలేదు. దీంతో ఎమ్మెల్యే వ్యవహార శైలి హాట్ టాపిక్ గా మారింది.
Also Read: పోలీస్ శాఖలో పని చేసిన వ్యక్తి వై ఉండి.. పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి భయమేంది సామీ..
* వైసిపి సానుభూతిపరులని..
ఈ ఎన్నికల్లో నరసరావుపేట ఎమ్మెల్యేగా చదలవాడ అరవిందబాబు( Arvind Babu ) ఎన్నికయ్యారు. అయితే తన నియోజకవర్గ పరిధిలోని ఉన్న మద్యం డిపోలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే మార్చేయాలని డిమాండ్ చేశారు. ఏకంగా 11 మంది ఉద్యోగులను విధుల్లో తొలగించాలని అరవింద్ బాబు కోరారు. వీరు వైసీపీ ప్రభుత్వంలో నియమితులు కావడంతో తొలగించాలని ఆయన పట్టుబట్టారు. ఆ 11 మందిలో ఒకరు మినహా మిగిలిన పదిమందిని వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. అయితే స్థానిక ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఏకంగా ఎక్సైజ్ డైరెక్టర్ నిశాంత్ కుమార్ ఛాంబర్ లోకి వెళ్లారు. అక్కడ రచ్చ రచ్చ చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈ విధంగా చేయడం వివాదంగా మారింది.
* అక్కడే బైఠాయింపు
అయితే అరవింద్ బాబు వెళ్లేసరికి డైరెక్టర్ నిశాంత్ కుమార్( Nishant Kumar ) ఉన్నారు. తాను లేఖ రాసినా స్పందించలేదని.. తాను చెప్పిన వారికి అవకాశం కల్పిస్తేనే అక్కడ నుంచి బయటకు వెళ్తానంటూ అక్కడే సోఫాలో పడుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ఎమ్మెల్యే తీరుపై ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర కు సమాచారం అందించారు. మంత్రితోపాటు వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఫోన్లో మాట్లాడి సముదాయించిన ఛాంబర్ నుంచి బయటకు వచ్చేందుకు అరవింద్ బాబు అంగీకరించలేదు. చివరకు నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని నరసరావుపేట డిపో మేనేజర్ ను ఆదేశిస్తూ డైరెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో అరవింద్ బాబు అక్కడ నుంచి వెళ్లిపోయారు.
* టిడిపి హై కమాండ్ సీరియస్
అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ఇలా అధికారుల విధులకు అడ్డం పడడం విమర్శలకు తావిస్తోంది. ముమ్మాటికి తప్పుడు చర్య అంటూ కూటమినేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై టిడిపి హై కమాండ్( TDP high command ) సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు హెచ్చరించారు. అయినా ఈ ఘటన చోటు చేసుకోవడంతో చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.
Also Read: వారి రాజీనామాలకు ఆరు నెలలు.. వైసిపి వ్యూహం.. గాల్లో ఎమ్మెల్సీలు!