https://oktelugu.com/

Chanakya Niti : ఈ ఐదు విషయాల్లో నోరు మూసుకొని ఉండటం మంచిది.. లేకుంటే జీవితం నాశనమే..!

Chanakya Niti :వివాహమైన తర్వాత దాంపత్య జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొందరు సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటే.. మరికొందరు దంపతులు నిత్యం ఏదో ఒకటి గొడవతో కొనసాగిస్తారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవ అనేది కామన్. ఒక్కోసారి గొడవ తీవ్ర స్థాయికి చేరుతుంది అని అనుకున్నప్పుడు అలాంటి సమయంలో మౌనంగా ఉండడం చాలా మంచిది.

Written By: , Updated On : March 1, 2025 / 01:00 AM IST
chanakya-niti

chanakya-niti

Follow us on

Chanakya Niti : ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’.. అన్న తెలుగు సామెత గురించి దాదాపుగా చాలామందికి తెలిసే ఉంటుంది. అంటే మంచి మాట వల్ల సమాజంలో గుర్తింపు వస్తుంది. సంబంధాలు మెరుగుపడతాయి. బంధుత్వం పెరుగుతుంది. కుటుంబం సంతోషంగా ఉంటుంది.. అయితే అందరూ మంచిగా మాట్లాడుతారని అనుకోలేము. కొందరు మాట్లాడడం వల్ల అక్కడున్న వాతావరణం గంధర ఘోరంగా మారుతుంది. ఇది ఒక్కోసారి ఘర్షణ వాతావరణానికి కూడా దారితీస్తుంది.. అయితే మాట వలన సమాజం లో ఎంత గుర్తింపు వస్తుందో ఒక్కోసారి మౌనంగా ఉండడం వల్ల జీవితం ప్రశాంతంగా మారుతుంది. ‘మౌనమేలనోయి..’ అని చాలామంది అవహేళన చేసిన కొన్ని సందర్భాల్లో మాత్రం మాట్లాడకుండా ఉండడమే బెటర్ అని చాణిక్యని ఇది తెలుపుతుంది. మరి ఏ సందర్భాల్లో మౌనంగా ఉండడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

వివాహమైన తర్వాత దాంపత్య జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొందరు సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటే.. మరికొందరు దంపతులు నిత్యం ఏదో ఒకటి గొడవతో కొనసాగిస్తారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవ అనేది కామన్. ఒక్కోసారి గొడవ తీవ్ర స్థాయికి చేరుతుంది అని అనుకున్నప్పుడు అలాంటి సమయంలో మౌనంగా ఉండడం చాలా మంచిది. ఎట్టి పరిస్థితులను ఇలాటి సమయంలో మరో మాట మాట్లాడకుండా Calm గా ఉండి పరిస్థితిని చక్కగా పెట్టుకోండి.

Also Read : ఈ 5 సూత్రాలు పాటిస్తే.. తొందరగా ధనవంతులవుతారు..

ప్రతిరోజు ఎంతోమందిని కలుస్తూ ఉంటాం. వీరిలో స్నేహితులు ఉండొచ్చు.. లేదా బంధువులు ఉండొచ్చు.. కొందరు తమ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇవి కొందరికి నచ్చకపోవచ్చు. అయినా వారితో బంధుత్వం కొనసాగాలంటే వారు తమ గొప్పతనాన్ని తెలియజేస్తున్నప్పుడు మౌనంగా ఉండండి. ఇలా ఉంటే మౌనంగా ఉండే వారిపై గొప్పలు చెప్పుకునే వారికి గౌరవం పెరుగుతుంది. దీంతో భవిష్యత్తులో వీరితోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు. అందువల్ల ఎదుటివాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు వారిని Avoid చేయకుండా వారికి అనుగుణంగా ఉంటూ మౌనంగా ఉండడమే మంచిది..

సమాజంలో గుర్తింపు రావాలంటే మాటే ప్రధానం అని అంటారు. అయితే మాట మాట్లాడే సమయంలో ఒక విషయం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. దాని గురించి పూర్తిగా తెలిసిన తర్వాతే మాట్లాడుకోవాలి. అలా కాకుండా ఒక విషయం గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడితే చులకనగా మారుతారు.

ఒక్కోసారి పార్ట్నర్స్ మధ్య విభేదాలు తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఒకరు చెప్పిన దానిని మరొకరు పట్టించుకోరు. వారు ఎంత మంచిగా మాట్లాడిన ఎదుటివారి వినరు. ఇలాంటి సమయంలో వారితో వాదించడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. లేకుంటే మరింత గొడవగా మారి సంబంధాలు దెబ్బతీసే అవకాశం ఉంటుంది.

సమాజంలో ఉన్న వ్యక్తులు అందరూ మంచివారు అని అనుకోలేము. అలాగే అందరూ మనవాళ్లే అని భ్రమ పడలేం. కొందరు మంచిగా మాట్లాడితే కొందరు మన గురించి చెడుగా మాట్లాడేవారు కూడా ఉంటారు. ఇలాంటివారు ఒక్కోసారి చెడుగా మాట్లాడినప్పుడు వారితో వాదించడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. ఎందుకంటే వారి దృష్టిలో చెడాభిప్రాయం కలిగినప్పుడు ఆ తర్వాత మిగతా కార్యక్రమాల ద్వారా నిజ నిరూపణ చేసుకోవాలి. అంతేకానీ వారితో వాదనలు దిగడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు.