Chanakya Niti Tips
Chanakya Niti: ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనే కోరికతో ఉంటారు. ఇందుకోసం ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అయితే అందరూ డబ్బును ఆర్జించడానికి ఏదో ఒక పనిచేస్తారు. కానీ కొందరు మాత్రమే ధనవంతులుగా మారుతారు. ప్రణాళికతో పాటు ఖర్చులు అదుపులో ఉంచుకోవడం వల్ల కొందరి ఆదాయం పెరుగుతుంది. మరికొందరు మాత్రం వచ్చిన ఆదాయాన్ని ప్రణాళిక లేకుండా ఖర్చు పెట్టడంతో చిన్నాభిన్న అవుతుంది. దీంతో ఇంట్లో ఎక్కువ కాలం డబ్బులు నిల్వ ఉండదు. అయితే చాణక్య నీతి ప్రకారం ఈ 5 సూత్రాలను పాటించడం వల్ల ఇంట్లో డబ్బు నిలుస్తుంది. అంతేకాకుండా అనతి కాలంలోనే ధనవంతులుగా మారిపోతారు. మరి ఆ సూత్రాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
అపర చాణక్యుడు మనుషుల జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను అందించారు. వీటిలో ఒక వ్యక్తి ధనవంతుడు కావాలంటే ఏమి చేయాలో..? ఏమి చేయకూడదో..? వివరించాడు. మనుషులు కొన్ని నియమాలు పాటించడం వల్ల డబ్బు కొరత ఉండకుండా ఉంటారని చాణక్యుడు పేర్కొన్నారు. ఇందుకోసం ఐదు సూత్రాలు పాటించాలని చెప్పారు వీటిలో మొదటిది..
నిజాయితీ :
కొంతమంది ముందుగానే ధనవంతులుగా మారుతారు. మరికొందరు వెనుకబడి పోతారు. ఇలాంటి వారిని చూసి వెనుకబడిన వారు తొందరగా ధనం సంపాదించాలనే ఆశతో ఉంటారు. దీంతో అక్రమంగా డబ్బు సంపాదించాలని అనుకుంటారు. కానీ చాణక్య నీతి ప్రకారం.. వీరి సంపాదన ఎక్కువ కాలం నిలబడదు. నిజాయితీగా డబ్బు సంపాదించిన వారు మాత్రమే తమ ధనాన్ని ఎక్కువ కాలం నిలుపుకోగలుగుతారు.
ప్లానింగ్ :
చాలామందికి ఆదాయం ఏదో రకంగా వస్తూ ఉంటుంది. కొందరు లక్షల్లో ఆదాయం పొందినా.. సరైన జీవనాన్ని కొనసాగించలేరు. మరికొందరు తక్కువ ఆదాయాన్ని పొందినా సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. ఇందుకు తేడాలు ఏమిటంటే ప్లానింగ్ లేకపోవడమేనని చాణక్యుడు చెప్పాడు. సరైన ప్లానింగ్ ఉండడం వలన ఆదాయం సమతుల్యమై అవసరానికి డబ్బు అందుతుంది. దీంతో ఎలాంటి సమస్యలు రావు.
ఖర్చులను తీసేసి..
కొంతమంది డబ్బు సంపాదిస్తారు. కానీ వచ్చిన ఆదాయాన్ని ఇతరుల వద్ద ఉంచుతారు. మరికొందరు ఉపయోగించని వాటిలో పెట్టుబడులు పెడతారు. ఇలాంటి డబ్బు ఎప్పటికైనా పెరగకుండా ఉంటుంది. అయితే ఎక్కువ శాతం అవసరాలకు డబ్బులు ఇంట్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. అలా ఖర్చులు ఫోనూ మిగతా డబ్బులు మాత్రమే పొదుపు లేదా ఇతర ముఖ్యమైన వాటిలో పెట్టుబడులు పెడుతూ ఉండాలి. ఇలా చేయడం వలన కుటుంబం పై భారం పడకుండా ఆదాయం మిగులుతూ ఉంటుంది.
ఆదాయయం వచ్చే చోటే..
కొంతమంది నివాసం ఒకచోట.. ఆదాయం వచ్చే ప్రదేశం మరోచోట ఉంటుంది. ఇలా మీరు ఆదాయం వచ్చే చోట కాకుండా వేరే చోట ఉండడం వల్ల అభివృద్ధి సాధించలేరు. అందువల్ల ఆదాయం వచ్చే ప్రదేశానికి వెళ్లడమే మంచి మార్గం అని చాణక్య నీతి చెబతుంది. ఆదాయం వచ్చే చోట జీవించడం వల్ల వీరు తొందరగా డబ్బు సంపాదించగలుగుతారు. ఎందుకంటే రవాణా ఖర్చులు తగ్గిపోవడంతో పాటు అనవసర ఖర్చులు ఉండవు. లేకుంటే పేదరికంలోనే ఉండిపోతారు.