Star Heroines : స్టార్ హీరోయిన్లకు సినిమాల ద్వారా వచ్చే డబ్బులకంటే, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి వెళ్తే వచ్చే డబ్బులు ఎక్కువగా ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. తమన్నా(Tamanna Bhatiya), సమంత(Samantha Ruth Prabhu), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) స్థాయి హీరోయిన్లు అయితే ఒక్క షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని అందుకుంటారు. ఒక సినిమా చేయడానికి మూడు నెలల సమయం పడుతుంది. ఆ మూడు నెలల షూటింగ్ కి వచ్చే డబ్బులు, కేవలం అరపూట కు హీరోయిన్స్ కి వచ్చేస్తుంది. మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ కి మాత్రమే కాదు, నిన్న గాక మొన్న ఇండస్ట్రీ కి వచ్చిన హీరోయిన్స్ కూడా ఈమధ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ మరియు ఇతర ఓపెనింగ్స్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. వీళ్ళు కూడా 40 నుండి 50 లక్షల రేంజ్ లో రెమ్యూనరేషన్స్ అందుకుంటూ ఉంటారు.
Also Read : అట్లీ ఓవర్ యాక్షన్..అల్లు అర్జున్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్..చేతులెత్తేసిన నిర్మాతలు
అయితే ఒక సంస్థ కి సంబంధించిన బ్రాంచ్ ఓపెనింగ్ కి పిలిచినా, మరే ఇతర కార్యక్రమానికి పిలిచినా హీరోయిన్లు ఆ సంస్థ బ్యాక్ గ్రౌండ్ ని కచ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. పరిశీలించి, ఎలాంటి కాంట్రవర్సీ లేదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే డేట్స్ ఇవ్వాలి. కానీ అలా చేయకుండా, డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు కదా అని ఓపెనింగ్ కి వెళ్తే కాజల్, తమన్నా లాగా సమస్యల్లో చిక్కుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే పుదుచ్చేరికి చెందిన ఓ సంస్థ క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడులు పెడితే అత్యధిక లాభాలు పొందవచ్చని కస్టమర్లను బుట్టలో వేసుకుంది. ఈ సంస్థ మాటలను నమ్మి దాదాపుగా పది మంది 2 కోట్ల 40 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఆ పెట్టుబడులు పెట్టినవారు తాము మోసపోయాము అంటూ బోరుమని విలపిస్తున్నారు. ఈ విషయంపై లాస్ పెట్ల కి చెందిన ఆశోకన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
దీంతో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు ఈ సంస్థకు సంబంధించిన వాళ్ళను విచారించడం మొదలు పెట్టారు. ఈ సంస్థకు సంబంధించిన కార్యాలయం ఒకటి 2022 వ సంవత్సరం లో కోయంబత్తూరు లో ఏర్పాటు చేయగా, దీని ఓపెనింగ్ కి హీరోయిన్ తమన్నా విచ్చేసింది. అదే విధంగా ఈ సంస్థకు సంబంధించిన ఒక కార్యక్రమం మహాబలిపురంలోని ఒక స్టార్ హోటల్ లో నిర్వహించగా, ఆ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ హాజరైంది. దీంతో వీళ్ళిద్దరిని పోలీసులు అతి త్వరలోనే విచారించబోతున్నారని కోలీవుడ్ లో ఒక న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదే కనుక జరిగితే కాజల్, తమన్నా పరువు పోయినట్టే. వాళ్లకు ఈ విషయంలో సంబంధం లేకపోవచ్చు, కానీ ఎంతో మందిని మోసం చేసిన ఒక సంస్థ కి బ్రాండ్ అంబాసిడర్లు గా పని చేసారంటే, ఈ హీరోయిన్స్ ఇంతకాలం కస్టపడి సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగినట్టే.