MLC Elections Result
MLC Elections : కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలలో గెలుపు ఎవరిది అనే చర్చ ప్రస్తుతం ఈ నాలుగు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా, ఇద్దరూ అంతకన్నా ఎక్కువ మంది కలిసినా చోటా ఈ టాపిక్ రావడం లేదంటే ఆశ్చర్యమే. mlc ఎన్నికల కోసం పట్టభద్రుల నమోదు ప్రారంభం నుండి ఇప్పటి వరకు అన్నీ వర్గాల్లో ఈ ఎన్నిక చాలా ముఖ్యమైన అంశం గా నిలిచింది. ఒకవైపు నమోదు చేసుకుంటూ మరోవైపు పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేసుకుంటూ ఒకరు ముందుకు సాగుతుంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు చేతులు కట్టుకొని, వచ్చిన తరువాత పార్టీ టికెట్ ప్రయత్నంలో కొంత మంది దృష్టి సారించటం వల్ల సమయానికి ప్రచారం చేయలేక వెనుకబడిపోయారు. ఈ విషయం లో నమోదు ప్రక్రియ, పరిచయ సభలు, ఆత్మీయ సమ్మేళనాలతో పధి అడుగులు ముందున్న ఆల్పోర్స్ నరేందర రెడ్డికి ప్రభుత్వంలో ఉన్న పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆయన బలం పదింతలయ్యింది. ఆ పార్టీ టికెట్ ఆశించి, బంగపడ్డ మరో అభ్యర్ధి కొత్తదారులు వెతుకుతూ, చివరికు బి.ఎస్.పి మద్దతుతో పోటీలో నిలిచాడు.
Also Read: మన గెలుపు ఎలా ఉండాలంటే.. ప్రత్యర్థి కూడా లేచి నమస్కరించాలి.. వైరల్ వీడియో
మరోవైపు బి.జె.పి. ఎలాగైనా ఎంఎల్‌సి స్తానాన్ని కైవసం చేసుకోవాలనే ప్రయత్నంలో పొటీలో గట్టిగా నిలిచింధి. b.r.s. పార్తీ మాత్రమే పోటీలో అభ్యర్తులను పెట్టలేదు. ఆ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు పార్టీ టిక్కెట్ రాకపోవడమే వేరే పార్టీ నుంచీ పోటి చేయాల్సిన పరిస్తితి ఏర్పాడింది. దీంతో టి.ఆర్.ఎస్. క్యాడర్ ఈ ఎన్నికల్లో ఎవరివైపు ప్రచారం చేయాలో తేల్చుకోలేక అగమ్య గోచారంలో పడ్డారు. కకావికలమైన పార్తీ క్యాడర్ అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తికి లోనయ్యరు. ఒకవైపు ఎన్నికల యుద్దం జరుగుతుండగా చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అన్నీ అనుకూలంగా మారాయి. బలమైనా అభ్యర్తీగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ అభ్యర్ధిని ఈవిధంగా ఎదురుకోవాలో తెలియక సోషల్ మీడియాను వేదికగా చేసుకొని వ్యతిరేకతను కలుగచేసేందుకు చెసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు ఎవరికి వారే క్యాడర్‌లో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగడం, వ్యుహాత్మకంగా ప్రత్యర్థుల ను ఎదుర్కోవడంలో వేసిన పాచిక లాఠో పూర్థిగా విజయ సూచిక ఒకవైపు తూగింది. దీనికీ తోడు ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావదంతో పార్టీలో జోష్ పెంచింది. పోలింగ్ కు ముందు కూడా ఈవిధంగా వ్యవహారించాలనే విషయం లో పార్టీ క్యాదర్ కు సలహాలు ఇది కూడా చివరి వరకు అప్రమతంగా ఉండెల చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది తేలిపోనున్నా.. అభ్యర్తులందరూ మాత్రమే గెలుపు మాదే అని గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు..
– (దహగాం శ్రీనివాస్)
Also Read : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఏపీకు షాక్.. ఇక ఆ సీట్లనీ మనకే!