https://oktelugu.com/

BigBoss: బిగ్​బాస్​-5 ఫైనల్​లో అతిథులుగా వచ్చేది వీరేనట?

BigBoss: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తోన్న హాట్​ రియాలిటీ గేమ్ షో బిగ్​బాస్​ సీజన్​ 5 ఈ వారంతో ముగియనుంది. ఎప్పుడో తొలి సీజన్​తో ప్రారంభమై.. అంతులేని ప్రేక్షకాదరణ పొందింది ఈ షో. అప్పటి వరకు ఎవ్వరికీ తెలియని వాళ్లను కూడా స్టార్లను చేసి ఓ స్థాయిలో కూర్చోబెట్టింది. కాగా, డిసెంబరు 19న జరిగే ఈ సీజన్​ ఫైనల్​కు నిర్వహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఫైనల్​ను నిర్వహించబోతున్నట్లు సమాచారం. […]

Written By: , Updated On : December 14, 2021 / 10:01 AM IST
Follow us on

BigBoss: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తోన్న హాట్​ రియాలిటీ గేమ్ షో బిగ్​బాస్​ సీజన్​ 5 ఈ వారంతో ముగియనుంది. ఎప్పుడో తొలి సీజన్​తో ప్రారంభమై.. అంతులేని ప్రేక్షకాదరణ పొందింది ఈ షో. అప్పటి వరకు ఎవ్వరికీ తెలియని వాళ్లను కూడా స్టార్లను చేసి ఓ స్థాయిలో కూర్చోబెట్టింది. కాగా, డిసెంబరు 19న జరిగే ఈ సీజన్​ ఫైనల్​కు నిర్వహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

big-boss-5-telugu-season-grand-final-guests

ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఫైనల్​ను నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ ఎపిసోడ్​కు రాజమౌళి అండ్​ ఆర్​ఆర్​ఆర్​ టీమ్​ను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నట్లు గతంలో ప్రచారం నడిచింది. అయితే, ఇప్పుడు మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సారి ఏకంగా బాలీవుడ్​ తారలను దింపనున్నట్లు సమాచారం.

గతేడాది బిగ్​బాస్​ ఫైనల్​కు మెగాస్టార్​ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి ట్రోఫీని అందించారు. ఈ ఏడాది మాత్రం బాలీవుడ్​ స్టార్​ కపుల్​ రణ్​వీర్​ సింగ్​, దీపికా పదుకొణెలతో పాటు ఆర్​ఆర్​ఆర్​లో నటించిన రామ్​చరణ్​, అలియాభట్​ జంటను నిర్వహకులు అతిథులుగా ఆహ్వానించినట్లు సమాచారం.

కాగా, టాప్​ 5లో వీజే సన్నీ, షణ్ముఖ్​ జశ్వంత్​, సిరిస మానస్​, శ్రీరామ్​ ఉన్నారు. వీరిలో విజేతగా నిలిచేది ఎవరో తెలియాలంటే వచ్చే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. కాగా, సోషల్​మీడియాలో మాత్రం సన్నీయే ఈ టైటిల్​ విన్నర్ అంటూ తెగ ప్రచారం నడుస్తోంది. మరి విజేత ఎవరో తెలుసుకోవాలంటే కాస్త టైమ్ పడుతుంది మరి. అప్పటి వరకు ఈ ఎగ్సైట్​మెంట్​తోనే ఉండంది.