Chanakya Niti: లోకం పిరికివాడిని చూసి నవ్వుతుంది. తెగించే వాడిని చూస్తే భయపడుతుంది. సమస్యలను చూసి పారిపోవడం కాదు వాటికి ఎదురెళ్లి నిలవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలి. భయస్తులను ఇంకా భయపెడతారు. అడవిని చూసి భయపడితే చెట్టే చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది. గుండెంటూ కలిగి అదే నీ వెంట సైన్యమై నిలుస్తుంది అన్నట్లు మనలో ధైర్యం ఉంటే ఏదైనా సాధించొచ్చు. మనలో భయం ఆవహిస్తే ఏ పని చేయలేం. అదే సాహసం ఉంటే ఏదైనా సాధ్యమే.

ఆచార్య చాణక్యుడు ధీరుడు ఎలా ఉండాలనే దానిపై స్పష్టత ఇచ్చాడు. తాను రాసిన నీతిశాస్త్రంలో మనిషిలో ధైర్యం ఎలా పని చేస్తుందని చెప్పాడు. మనిషి మాత్రమే సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ ఏ జంతువు కూడా తన ప్రాణాన్ని తాను తీసుకోదు. ధైర్యంగా నిలబడి పోరాడుతుంది. మనిషి కూడా అలాగే తన జీవితంలో ఎదురయ్యే సమసస్యల నుంచి బయట పడేందుకు ఉపాయం ఆలోచించారు. ఆంగ్లంలో ఓ సామెత ఉంది. ఎ స్మాల్ కీ ఓపెన్ ద బిగ్ డోర్.
ఎంతటి సమస్యకైనా తరుణోయం ఉంటుంది. సమస్యలు వచ్చాయని బాధపడే బదులు వాటిని ఎదుర్కొని నిలిచిన వాడికే అవి సలాం చేస్తాయి. అందుకే సమస్యల వలయంలో చిక్కుకున్నానని కుమిలిపోయే బదులు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తేల్చుకోవాలి. ప్రతి మనిషిలో ధైర్యం ఒకేలా ఉంటుంది. కాకపోతే దాన్ని ఉపయోగించుకోవడంలోనే అసలు విషయం దాగుంది. ఈ నేపథ్యంలో బాధల నుంచి తప్పించుకోవాలని ఒక ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలి.

పిరికివాదిని మదిని బింకమీలాగురా అన్నాడు వేమన. పిరికివాడు మీదికి ధైర్యంగా మాట్లాడినా లోపల భయపడుతుంటాడు. కానీ ధైర్యవంతుడు అలా కాదు. తన ధీరత్వంతో అందరిని తన వెంట ఉంచుకుంటాడు. పిరికివాడు రోజు చస్తాడు. ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు. అందుకే మనిషిలో ధైర్యం ఉండాలి. దీంతో సమాజానికి కూడా మంచి జరుగుతుంది. ఏ పని చేయాలన్నా సులభం అవుతుంది. మన బుద్ధిబలమే మనకు శ్రీరామరక్ష. తప్పు చేయనివాడికి భయం ఉండదు. ధైర్యవంతుడికి బలమెక్కువ. మంచి చేయడానికి జంకు ఉండకూడదు.