Rohit Tears : ఐపీఎల్ లో ముంబైకి కెప్టెన్ గా 5 సార్లు కప్ ను అందించి విజయవంతమైన కెప్టెన్ గా నిరూపించుకున్న రోహిత్ శర్మ కనీసం టీమిండియాకు ఒక కప్ అదించలేడా? అని అతడికి టీమిండియా పగ్గాలు అప్పగించారు. అయితే రోహిత్ స్వయంగా విఫలమయ్యాడు. జట్టును నడిపించడంలోనూ దారుణంగా ఓడిపోయాడు. చివరకు పేలవ ప్రదర్శనతో టీ20 వరల్డ్ కప్ నుంచి టీమిండియా వైదొలగడం వెనుక కెప్టెన్ రోహిత్ పాత్ర కూడా ఉంది.

సరైన బౌలింగ్ దాడి లేదు. బ్యాటింగ్ లో మెరుపులు లేవు. ఫాంలో లేని వారిని తీసుకొని ఆడించారు. తనూ ఓపెనర్ గా ఫెయిల్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం విఫలమయ్యాడు. పరుగులు చేయడానికి తండ్లాడారు. వెరసి టీమిండియా కూర్పుపైనే అందరిలోనూ అనుమానాలు. సరైన ప్రత్యర్థి దొరికితే టీమిండియా ఎందుకు పనికిరాదన్న అనుమానాలు.. సెమీస్ లో అదే జరిగింది. బలమైన ఇంగ్లండ్ చిత్తు చిత్తుగా ఘోరంగా టీమిండియాను ఓడించింది. ఇంటిదారి పట్టించింది.
టీమిండియా చేసిన 168 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు ఇద్దరే కొట్టేయడంతో ఓటమిని తట్టుకోలేక కెప్టెన్ రోహిత్ డగౌట్ లో ఏడ్చేశాడు. కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఐపీఎల్ లో అన్ని విజయాలు అందించిన అతడు తన తొలి ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టును గెలిపించలేకపోయినందుకు కన్నీరు పెట్టుకున్నాడు. రోహిత్ ఏడుస్తుంటే కోచ్ ద్రావిడ్ వెళ్లి ఓదార్చిన పరిస్థితి.
మ్యాచ్ అనంతరం కూడా రోహిత్ ప్రజేంటేషన్ అప్పుడు బాధపడ్డాడు. “ఈరోజు చాలా నిరుత్సాహానికి గురిచేసింది. ఆ స్కోర్‌ను పొందడానికి మేము బ్యాకెండ్‌లో బాగా బ్యాటింగ్ చేసాం. మేము బాల్‌తో మార్కును అందుకోలేకపోయాము. బౌలింగ్ లో ఘోరంగా విఫలమయ్యాం. నాకౌట్ ఆటలలో ఒత్తిడిని సరిగ్గా ఎదుర్కోలేకపోయాం. కుర్రాళ్లు అర్థం చేసుకునేంతగా ఆడలేకపోయారు’ అంటూ రోహిత్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు.
— Guess Karo (@KuchNahiUkhada) November 10, 2022
మొత్తంగా టీమిండియా కల చెదిరిపోవడంలో తన పాత్ర కూడా ఉండడంతో రోహిత్ ఏడ్చేశాడు. అభిమానుల కల నెరవేర్చనందుకు ఇలా ఎమోషనల్ అయ్యాడు.
— Guess Karo (@KuchNahiUkhada) November 10, 2022