Homeఎంటర్టైన్మెంట్RRR Actor Ajay Devgn: తప్పు చేసి జైలు పాలైన RRR నటుడు అజయ్ దేవగన్

RRR Actor Ajay Devgn: తప్పు చేసి జైలు పాలైన RRR నటుడు అజయ్ దేవగన్

RRR Actor Ajay Devgn: బాలీవుడ్ లో టాప్ 5 స్టార్ హీరోల లిస్ట్ తీస్తే అందులో అజయ్ దేవగన్ గారు కచ్చితంగా ఉంటారు..మాస్ ప్రాంతాలలో ఈయనకి ఉన్న క్రేజ్ ఎవ్వరికి లేదు అనే చెప్పాలి..ఇటీవలే ఈయన రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సషనల్ బ్లాక్ బస్టర్ #RRR లో రామ్ చరణ్ కి తండ్రిగా , స్వతంత్ర సమర యోధుడి పాత్రలో అద్భుతంగా నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..సినిమాలో ఆయన పాత్ర కనిపించేది కాసేపే అయినా ప్రేక్షుకులను ఒక్క రేంజ్ లో కనెక్ట్ చేసింది అనే చెప్పాలి..ప్రస్తుతం ఆయన దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం రన్ వే చిత్రం విడుదలకి దగ్గర్లో ఉంది..బిగ్ బీ అమితాబ్ బచ్చన్,రకుల్ ప్రీత్ సింగ్ మరియు ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 29 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..ఈ సందర్భంగా ఆయన ఈ చిత్ర ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు..ఒక్క ఇంటర్వ్యూ లో ఆయన తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకోగా అవి ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

RRR Actor Ajay Devgn
RRR Actor Ajay Devgn

ఈ ఇంటర్వ్యూ లో అజయ్ దేవగన్ తన కాలేజీ రోజుల గురించి మాట్లాడుతూ ‘ కాలేజీ రోజుల్లో నేను పెద్ద గూండాలాగా ప్రవర్తించేవాడిని..ఎప్పుడు గొడవల్లోనే ఉండేవాడిని, రెండు మూడు సార్లు జైలుకి కూడా వెళ్ళాను..మా నాన్న నన్ను ఎప్పుడు తిడుతూ ఉండేవాడు..ఒక్క రోజు ఆయనకీ తెలీకుండా ఆయన గన్ ని దొంగలించి గాల్లో పేల్చాను..దాని వల్ల నన్ను పోలీసులు అరెస్ట్ చేసారు..అలా తరుచు జరిగే గొడవల్లో అరెస్ట్ అయినా సందర్భాలు చాలానే ఉన్నాయి..కానీ ఆ రోజులు మేము బాగా ఎంజాయ్ చేసాము..నా జీవితం లో మోస్ట్ మెమొరబెల్ డేస్ అంటే అది కాలేజీ రోజులే’ అంటూ చెప్పుకొచ్చాడు..ఇది ఇలా ఉండగా అజయ్ దేవగన్ గతం లో కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు..2008 వ సంవత్సరం లో వచ్చిన ‘యూ మే ఔర్‌ హమ్‌’ మరియు 2016 వ సంవత్సరం లో వచ్చిన ‘శివాయ్’ అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు..ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు..కానీ ’83 రన్ వే’ చిత్రం మాత్రం కచ్చితంగా విజయం సాధించే చిత్రం ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది, మరి అజయ్ దేవగన్ ఈ సినిమా తో దర్శకుడిగా ఈసారి అయినా విజయం సాధిస్తాడా లేదా అనేది తెలియాలి అంటే 29 వ తారీకు వరుకు వేచి చూడాల్సిందే.

Also Read: RRR vs KGF 2 Box Office Collection: షాకింగ్ : అక్కడ ఆర్ఆర్ఆర్ కి 20 కోట్లు, కేజీఎప్ కి 45 కోట్లు !

ఇది ఇలా ఉండగా హీరోగా అజయ్ దేవగన్ కెరీర్ ప్రస్తుతం మంచి ఊపులో ఉంది అనే చెప్పాలి..ఈయన హీరో గా వెండితెర మీద కనిపించిన ఆఖరి చిత్రం తానాజీ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది..బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా దాదాపుగా 330 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసింది..అంతతి సంచలన విజయం తర్వాత ఆయన మళ్ళీ పూర్తి స్థాయి హీరో గా మైథాన్ అనే సినిమా ద్వారా మన ముందుకి రాబోతున్నాడు..బోనీ కపూర్ న్రిమాతగా వ్యవహరించిన ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధం గా ఉన్నది..ఈ సినిమా తో మరోసారి తమ హీరో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ తిరగరాయడం ఖాయం అని ఆయన అభిమానులు గట్టిగ నమ్ముతున్నారు..కేవలం సినిమాలు మాత్రం కాకుండా వెబ్ సిరీస్ లు కూడా వరుసగా చేస్తున్నాడు అజయ్ దేవగన్..ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన రుద్ర అనే వెబ్ సిరీస్ ఇటీవలే హాట్ స్టార్ లో విడుదల అయ్యి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నది.

Also Read: ఇద్ద‌రితో ఎఫైర్ నడిపిస్తున్న యంగ్ హీరో.. ఒక‌రికి తెల‌వ‌కుండా మ‌రొక‌రితో.. చివరకు

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

1 COMMENT

  1. […] ఈ విషయం పై యూటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో యాంకర్ రాజమౌళి తో మాట్లాడుతూ ‘రామ్ చరణ్ పాత్ర ని పెంచడానికే ఎన్టీఆర్ పాత్ర ని బాగా తగ్గించేశారు అని ఎన్టీఆర్ అభిమానులు ఫీల్ అవుతున్నారు..దీనికి మీరు ఏమి సమాధానం చెప్తారు’ అంటూ అడిగిన ప్రశ్న కి రాజమౌళి సమాధానం చెప్తూ ‘ఒక్కవేల నేను ఇద్దరి హీరోలను సమానంగా బాలన్స్ చెయ్యకపొయ్యి ఉంటె ఈరోజు #RRR సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు..చూసే జనాలకు ఒక్క నిమిషం కూడా ఒక్కరి పాత్ర తగ్గినట్టు అనిపించదు..ఫస్ట్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ స్టోరీ అలాగే సెకండ్ హాఫ్ మొత్తం రామ్ చరణ్ స్టోరీ చూపించాము..జనాలు థియేటర్స్ నుండి బయటకి వచ్చేటప్పుడు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ని ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు కాబట్టి రామ్ చరణ్ నే మేము ఎక్కువ హైలైట్ చేసినట్టు అభిమానులకు అనిపించి ఉండొచ్చు..చూసే విధానం బట్టి ఉంటుంది ఏదైనా..ఇందులో రామరాజు భీం ని ఆదర్శం గా తీసుకుంటాడు..అప్పుడు అభిమానులు ఎన్టీఆర్ ని రామ్ చరణ్ ఫాలో అవుతున్నాడు , ఆయనే హీరో అని అనుకోవచ్చు కదా..అలాగే రామ్ చరణ్ ని లాస్ట్ లో ఎన్టీఆర్ చదువు నేర్పించి అన్నా అంటాడు..అప్పుడు రామ్ చరణ్ ఈ సినిమా హీరోనా??..ఇక్కడే తెలిసిపోతుంది ఇద్దరిలో హీరో ఎవరో చెప్పడం ఎంత కష్టమో..ఎందుకంటే ఇద్దరినీ సరిసమానంగా చూపించాము కాబట్టి’ అంటూ సమాధానం ఇచ్చాడు రాజమౌళి. Also Read: RRR Actor Ajay Devgn: తప్పు చేసి జైలు పాలైన RRR నటుడు … […]

Comments are closed.

Exit mobile version