Chanakya Neeti Telugu: ఆచార్య చాణక్యుడు తన తెలివి తేటలతో చంద్ర గుప్తుని కాలంలో ఎన్నో విజయాలు అందుకునేందుకు తోడ్పడ్డాడు. రాజనీతి శాస్త్రవేత్తగా చాణక్యుడిని పోలుస్తుంటారు. అతడు చూపిన మార్గాలు కూడా అలాగే ఉంటాయి. అతడు చూపించిన మార్గాలే నేటికి ఆదర్శనీయంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చాణక్యుడు సూచించిన మార్గాలే నేటి ఆచరణలో ఉండటం గమనార్హం. చాణక్యుడు అన్ని రంగాల్లో నిష్ణాతుడు. దీంతో అన్ని విభాగాల్లో పాండిత్యం సంపాదించాడు. తన నైతికతతో ఎన్నో నియమాలు చూపించాడు. చాణక్యుడి నీతి ప్రకారం నడుచుకుంటే జీవితంలో అపజయం అనేది ఉండదనే చెబుతారు.

చాణక్యుడు తన మేథో శక్తితో ఎవరినైనా నియంత్రించే వాడు. నీతితో ఎవరినైనా నియంత్రించేందుకు కొన్ని మార్గాలు చూపాడు. చాణక్యుడి నీతి ప్రకారం ఎంతటి వారినైనా నియంత్రించేందుకు గల కారణాలు వివరించాడు. మేధావులను నియంత్రించడం కొంత కష్టమైన పనే అని చాణక్యుడు నమ్ముతాడు. వారిని అదుపులో ఉంచాలంటే మనం సత్యాన్ని మాట్లాడటం ద్వారా వారిని నియంత్రించొచ్చు. సులువుగా మేధావులను ఆకర్షించొచ్చు అని చెబుతుంటారు. ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటే మేలు కలుగుతుంది.
అత్యాశాపరులను సులభంగా అదుపులో ఉంచవచ్చు. అత్యాశాపరులు ఎవరితోనూ అంటకాగరు. వారు డబ్బు, సంపదకే విలువ ఇస్తారు. దీంతో వీరిని నియంత్రించడం ఈజీగానే చేయవచ్చు. డబ్బులు ఇస్తే చాలు వారు దేన్ని పట్టించుకోరు. సంపద పెంచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంటారు. దీంతో వీరిని తమ దారికి తెచ్చుకోవడం పెద్ద విషయమేమీ కాదు. చాణక్యుడు సూచించిన ప్రకారం మనం కొందరిని నియంత్రణలోకి తీసుకోవడం మామూలే. కానీ ఇంకొంత మందిని తమ ఆధీనంలోకి తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చు.

దేశాభివృద్ధిలో తమదైన పాత్ర పోషించే వారిని తమ బిడ్డలుగా పొందాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. పిల్లల పెంపకంలో నీతి, నియమాలు పాటించి వారిని సరైన మార్గంలో పెంచితే వారు మంచి మార్గంలోనే నడుస్తారు. దీంతో వారి నడవడిక మన సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. దీనికి తల్లిదండ్రులు తమ పాత్ర సరైన విధంగా నడుచుకుంటే మన సంతానం కూడా సరైన దారిలో నడిచి మన పేరు ప్రతిష్టలు నిలుపుతారు. అందుకే పండిత పుత్ర పరమ శుంఠ అంటుంటారు. ఇలా పిల్లల పెంపకంలో కూడా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సమాజానికి మన వంతు పాత్ర పోషించాలని చెబుతుంటాడు.