Janhvi Kapoor: అలనాటి నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు సినిమాలపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రధానంగా ఇక్కడి హీరో ఎన్టీఆర్ అంటే తనకెంతో ఇష్టమని, ఆయనతో నటించాలని కోరిక ఉందని స్పష్టం చేశారు. అవకాశం వస్తే ఆయనతో.. అది.. చేయడానికి రెడీగా ఉన్నట్లు ప్రకటించారు. జాన్వీ నటించిన ‘మిలీ’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆమె హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. అవకాశం వస్తే దక్షిణాది చిత్రాల్లో నటించడానికి రెడీగా ఉన్నట్లు తెలిపారు. జాన్వీ కపూర్ జూనియర్ పై గతంలోనూ కామెంట్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడినప్పుడు తనతో అవకాశం వస్తే నటిస్తానని అన్నారు. ఇప్పుడు మరోసారి ఆయనతో నటించాలని కోరిక ఉందని చెప్పడం.. ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీ గా హీరోయిన్ గా మారింది. ఆమె తండ్రి బోనీ కపూర్ ఆధ్వర్యంలో పలు చిత్రాల్లో నటిస్తోంది. లెటేస్టుగా మత్తు కుట్టి జేవియర్ డైరెక్షన్లో ‘మిలీ’ రూపుదిద్దుకుంది. ఈ చిత్రం నవంబర్ 4న రిలీజ్ కాబోతుంది. మలయాళ చిత్ర ‘హెలెన్’కు ఇది రీమేకే. ఈ సినిమా గురించి జాన్వీ పలు విషయాలు మాట్లాడారు. ఒక నటిగా ఈ సినిమా కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డానని అన్నారు. మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రతలో 22 రోజుల పాటు ఈ సినిమాను చిత్రీకరించారని అన్నారు.
ఈ సందర్భంగా జాన్వీని విలేకరులు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఎన్టీఆర్ గురించి చెప్పమని అడిగారు. దీంతో ఆయన గురించి ఇప్పటికే పలుసార్లు చెప్పా. ఎన్టీఆర్ లెజెండ్ హీరో. ఆయనతో నటించాలన్న కోరిక ఉంది. అవకాశం వస్తే తప్పకుండా సినిమా చేస్తా… అని అన్నారు.అంతేకాకుండా దక్షిణాది చిత్రాలంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడి ఇండస్ట్రీలో నటించే అవకాశం త్వరలో వస్తుందని అనుకుంటున్నానని అన్నారు.

అటు బోనీకపూర్ మాట్లాడుతూ నేను తీసిన సినిమాల్లో 16 హైదరాబాద్ లో చిత్రీకరించామని అన్నారు. హైదరాబాద్ తో తనకు ఎంతో సంబంధం ఉందని పేర్కొన్నారు. ఇక నా సతీమణి శ్రీదేవి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉండే నటినే అని అన్నారు. ఇప్పుడు మా కూతురు జన్వీని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. అయితే కొందరు ఇక్కడి కథలను రిజెక్ట్ చేశారట.. అని విలేకరులు అడగగా సమాధానాన్ని దాటవేశారు.