Pre-period depression: పీరియడ్స్‌కి ముందు డిప్రెషన్‌కి గురవుతున్నారా? బయట పడటం ఎలా?

ప్రీమెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ ఉన్నవారిలో ఎక్కువగా ఆకలి ఉంటుంది. ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఆకలి లేకపోయిన తినడం తినాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ అధికంగా తినడం వల్ల ఊబకాయ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ డిజార్డర్ సమయంలో శరీరంలో సెరోటోనిన్ అనే హార్మోన్ లోపం ఏర్పడుతుంది

Written By: Kusuma Aggunna, Updated On : October 4, 2024 5:12 pm

Periods-problem

Follow us on

Pre-period depression: మహిళలకు ప్రతీ నెలా పీరియడ్స్ అనేవి సాధారణం. ప్రతి నెల మహిళలు నెలసరి నొప్పితో పెద్ద యుద్ధమే చేస్తారు. అయితే పీరియడ్స్ సమయంలో మూడ్ స్వింగ్స్, బాడీ పెయిన్ అనేవి సాధరణం. కానీ కొందరికి పీరియడ్స్ రాకముందే వస్తాయి. దీన్నే ప్రీమెన్‌స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అని అంటారు. అయితే ఈ డిజార్డర్ ఉన్నవారిలో పీరియడ్స్ రాకముందు నుంచి ఇబ్బందుల పడతారు. కొందరు అయితే
డిప్రెషన్‌లోకి వెళ్తారు. అయితే సాధారణంగా పీరియడ్స్ సర్కిల్ ఎవరికైనా 28 రోజులు ఉంటుంది. అలాంటి వారికి అండోత్సర్గము 14వ రోజున కొనసాగుతుంది. అయితే ఈ సమయంలో కొందరు మహిళలు మానసికంగా ఇబ్బంది ఎదుర్కొంటారు. కోపం, చిరాకు, విచారం, నిరాశ వంటివి కూడా కనిపిస్తాయి. కొందరికి ఛాతీ నొప్పి, రొమ్ములు గట్టిపడటం, కడుపు ఉబ్బరం, రుతు మైగ్రేన్ వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే ఈ డిజార్డర్ ఎక్కువగా 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నవారిలో కనిపిస్తుంది. కొందరు సాధారణంగానే ఒత్తిడి, డిప్రెషన్‌‌తో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాళ్లకి ఎక్కువగా ఈ ప్రీమెన్‌స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ డిజార్డర్ ఉన్నవారిలో వచ్చే మార్పులు
ప్రీమెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ ఉన్నవారిలో ఎక్కువగా ఆకలి ఉంటుంది. ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఆకలి లేకపోయిన తినడం తినాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ అధికంగా తినడం వల్ల ఊబకాయ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ డిజార్డర్ సమయంలో శరీరంలో సెరోటోనిన్ అనే హార్మోన్ లోపం ఏర్పడుతుంది. దీంతో మానసికంగా ఇబ్బంది పడతారు. మీ బాడీలో ఉన్న హ్యాపీ హార్మోన్లను నియంత్రిస్తుంది. దీనివల్ల ఎక్కువగా బాధపడతారు. ఆనందంగా లేకుండా ఎప్పుడూ నిరాశగా ఉంటారు. అయితే దీనిని తగ్గించడానికి గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా ఇస్తారు. ఈ మాత్రల వల్ల అండోత్సర్గము ఆగిపోతుంది. అప్పుడు హార్మోన్లలో మార్పులు మారకుండా ఉంటాయి. అయితే ఈ డిజార్డర్‌ను తగ్గించాలంటే కేవలం గర్భనిరోధక మాత్రలు మాత్రమే కాకుండా జీవనశైలిలో మార్పులతో కూడా తగ్గించవచ్చు. ప్రతి రోజూ వ్యాయామాలు చేయడంతో పాటు పోషకాలు ఉండే ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఒత్తిడికి లోనవుకుండా ఉండాలి. తినే ఆహారంలో కాల్షియం, మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలి. బాడీకి సరిపడా నిద్రపోవాలి. ముఖ్యంగా యోగా మెడిటేషన్ వంటివి ఎక్కువగా చేయాలి. అప్పుడే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే కొందరు అమ్మాయిలు ఈ డిజార్డర్ గురించి బయటకు చెప్పుకోవడం లేదు. దీనివల్ల సరైన సమయానికి వైద్యం అందక సమస్యను ఇంకా పెంచుకుంటున్నారు. అయితే 70 శాతం మంది మహిళలకు ఈ ప్రీమెన్‌స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. దేశంలో అయితే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న మహిళలు 3.7 శాతం నుంచి 65.7 శాతం వరకు ఉన్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.