Chanakya Neeti : వివాహ బంధంలో శారీరక సంతృప్తి చాలా కీలకం. మానసికంగా మీరు చాలా ఆనందంగా ఉన్నా.. శారీరకంగా ఇబ్బందులు ఉంటే.. ఆ వివాహ బంధంలో కల్లోలం తప్పదని చాణక్యుడు చెప్పాడు. దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఇద్దరి మధ్య లైంగిక చర్య చాలా అవసరం. లేదంటే దంపతుల మధ్య దూరం పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీంతో పురుషులు ఇతర స్త్రీలకు ఆకర్షితులవుతారని చాణక్య నీతి చెబుతుంది.
చాలా మందికి చిన్న వయసులోనే పెళ్లి అవుతుంటుంది. ఈ వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల వారికి సంబంధం మీద అంత అవగాహన ఉండదు. ఈ వయసు వారు కోరికలపై ఎక్కువ శ్రద్ధ చూపతారు. దీంతో.. ఇతర స్త్రీల వైపు ఆకర్షితులవుతారని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఇర చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల కూడా ఇది జరుగుతుంది. ఎందుకంటే వీరు బాధ్యతల్ని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. దీంతో.. భాగస్వామితో గొడవలు ప్రారంభం అవుతుంతాయి. దీంతో.. వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు పురుషులని చాణక్య నీతి చెబుతుంది.
దంపతుల మధ్య నమ్మకం ఉండాలి. అది లేకపోతే.. భార్యభర్తల మధ్య ప్రేమ ఉండదు. అనుమానాలే ఉంటాయి. బంధంలో నమ్మకం లేక అనుమానం ఎక్కువ మొదలు అవుతుందో ఆ రిలేషన్ చాలా కష్టంగా ముందుకు సాగుతుంటుంది. అందుకే భార్యభర్తల మధ్య నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే.. వివాహేతర సంబంధాలకు పరిస్థితులు దారితీస్తాయని తెలిపారు చాణక్యుడు.
భార్యభర్తలు తల్లిదండ్రులు అయ్యే వరకు వారి మధ్య ప్రేమ ఎక్కువగా ఉంటుంది. కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరి అభిరుచి, ప్రేమ పిల్లల మీదకు కామన్ గారుతుంటుంది. ముఖ్యంగా భార్య పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కామన్ గా జరిగే విషయమే. దీంతో.. పురుషుడు ఇతర స్త్రీల వైపు ఆకర్షితులవుతారు అంటున్నారు చాణక్యుడు.
భార్యభర్తలు ఎప్పుడైతే తమ కోసం సమయం కేటాయించారో అప్పుడు వారి మధ్య గొడవలు మొదలవుతాయని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. దంపతులు తమ ఇష్టయిష్టాలకు సమయం కేటాయించాలని నీతి శాస్త్రం చెబుతుంది. సమయం కేటాయించకపోతే గొడవలు మొదలై.. ఆ బంధం వివాహేతర సంబంధం వైపు అడుగులేస్తుందని చాణక్య నీతి తెలిపింది.