trip : అరుణాచల్ ప్రదేశ్: భారతదేశ ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ సహజ అందాలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే.. భారతీయులైనా సరే ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాల్సిందే. ఇక్కడ పర్వతాలు, అందమైన పచ్చని లోయలు, సరస్సులు, బౌద్ధ దేవాలయాలు మొదలైనవి ఉన్నాయి. ఇవి పర్యాటకులను ఆకర్షిస్తాయి. అంతేకాదు ఇక్కడ సందర్శించడానికి చాలా ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు వందలాది రకాల పక్షులను చూడవచ్చు. అంతేకాదు ఇక్కడ మూడు పులుల అభయారణ్యాలు కూడా ఉన్నాయి. ఇక ఇక్కడ జంగిల్ సఫారీని ఎంజాయ్ చేయవచ్చు.
నాగాలాండ్: విదేశీయులే కాకుండా భారతీయులు కూడా సందర్శించడానికి అనుమతి అవసరమైన ప్రదేశాలలో నాగాలాంగ్ ఒకటి. ఇక్కడ అనేక తెగలు నివసిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో గొప్ప భాషా సంప్రదాయాన్ని చూడవచ్చు. ఇక్కడ అనేక రకాల పక్షులు ఉన్నాయి. భౌగోళిక పరంగా కూడా ఈ ప్రదేశం భారతదేశానికి చాలా ముఖ్యంగా పరిగణిస్తారు.
మిజోరం: నీలి పర్వతాల భూమిగా ప్రసిద్ధి చెందింది మిజోరాం. ఇది భారతదేశంలో అందమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ యాత్రను ప్లాన్ చేయడం గొప్ప అనుభూతిని అందిస్తుంది. అయితే ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే భారతీయులైనా సరే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందే. ఇక్కడి ప్రకృతి అందాలే కాకుండా సంస్కృతి కూడా చాలా గొప్పగా కనిపిస్తుంది.
లడఖ్: భారత రాష్ట్రమైన లడఖ్‌లోని బౌద్ధ విహారాలు, నదులు, సరస్సులు, లోతైన లోయ, పర్వత మార్గాలు, దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. ఇక్కడ నిర్మించిన ఏటవాలు చెక్క గృహాలు కూడా చాలా అందంగా కనువిందు చేస్తుంటాయి. ప్రస్తుతం ఇక్కడికి వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సిందే.
సిక్కిం: ఈశాన్య భాగంలో ఉన్న సిక్కిం రాష్ట్రం భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రాలలో ఒకటిగా పేరు గాంచింది. అయితే సిక్కిం అనేక అంశాల దృష్ట్యా చాలా ముఖ్యమైన ప్రదేశంగా కూడా ఉంది. కనుక ఇక్కడకు వెళ్లడానికి ఎవరికైనా అనుమతి తీసుకోవాల్సిందే. ఇక్కడ ప్రపంచంలోని మూడవ ఎత్తైన శిఖరం కాంచన్‌జంగా ఉంది. ఇక్కడ గ్యాంగ్‌టక్‌కు వెళ్లవచ్చు. ప్రశాంతమైన సమయాన్ని గడపవచ్చు. షాపింగ్‌ను ఆనందించవచ్చు. అంతేకాదు సిక్కింలో ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ వంటి ఉత్తేజకరమైన కార్యకలాపాలను ఎంజాయ్ చేయవచ్చు.
లక్షద్వీప్: భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌ను సందర్శించడానికి కచ్చితంగా అనుమతి కావాల్సిందే. నీలి సముద్రం, తెల్లని ఇసుక , పచ్చదనం తో సహజ సౌందర్యం ఎంతో ఆకర్షితంగా ఉంటుంది ఈ ప్రదేశం. ఈ ప్రదేశం ప్రత్యేక ఆహారపు రుచులతో ప్రసిద్ధి చెందింది. లక్షద్వీప్‌లో జలక్రీడలను ఎంజాయ్ చేయవచ్చు.