Chanakya Neeti : జీవితంలో డబ్బు సంపాదించాలని చాలామందికి ఉంటుంది. కానీ కొందరు మాత్రమే ధనవంతుల అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇంకొందరు ఉత్తగానే పేదవారుగా ఉన్న అతి తొందరగా ధనవంతులుగా మారుతారు. మిగతావారు చూసి షాక్ అవుతారు. అయితే కొందరు మాత్రమే తొందరగా ధనవంతులు కావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ కొన్ని మంచి లక్షణాలు ఉండడం వల్ల అనుకున్న దాని కంటే త్వరగా డబ్బు సంపాదిందే అవకాశం ఉందని చాణక్య నీతి తెలుపుతుంది. అపర చాణక్యుడు రాజనీతి శాస్త్రం గురించే కాకుండా మనుషుల జీవితాలకు సంబంధించి ఎన్నో విషయాలను చెప్పాడు. వీటిలో త్వరగా ధనవంతులు కావాలంటే ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. అవేంటంటే?
Also Read : నుదుటి కుంకుమ చెరిపేసిన వారికి.. రక్తసిందూరం చూపించాం: నరేంద్ర మోడీ
సమాజంలో మంచివారు, చెడ్డవారు రెండు రకాల మనసులు ఉంటారు. ఎవరు ఎలా ఉన్నా పెద్దలను మాత్రం గౌరవించాలి అనే లక్షణం ఉన్నవారు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. అంతేకాకుండా వీరు మిగతా వారి కంటే త్వరగా ధనవంతులుగా మారుతారు. పెద్దలకు గౌరవం ఇచ్చేవారు వారి ఆశీస్సులు పొందుతారు. అంతేకాకుండా జీవితానికి సంబంధించిన కొన్ని విలువైన విషయాలు వారు చెబుతారు. వాటిని ఫాలో అయిన వాళ్లు జీవితంలో త్వరగా డబ్బు సంపాదిస్తారు.
డబ్బు అందరూ సంపాదిస్తారు. కానీ కొందరికి మాత్రమే దానం చేసే గుణం ఉంటుంది. దానం చేసే గుణం ఉన్నవారు జీవితంలో త్వరగా డబ్బు సంపాదిస్తారు. ఇలా దానం చేయడం వల్ల వారికి దేవుని ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా దానం చేయడం వల్ల సమాజంలో గుర్తింపు వస్తుంది. ఈ గుర్తింపుతో వారు ఎటువంటి పనులనైనా ఈజీగా చేయగలుగుతారు. దీంతో మిగతా వారి కంటే ముందుకు వెళ్తారు.
డబ్బు కంటే సమయం చాలా ముఖ్యమైనదని కొందరి భావన. తప్పు పోయిన సంపాదించుకోవచ్చు. కానీ సమయం దాటిపోతే మళ్ళీ తిరిగి రాదు. అందువల్ల ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే తత్వం కలిగిన వారు త్వరగా డబ్బు సంపాదిస్తారు. అంతేకాకుండా మిగతా వారి కంటే మీరు అత్యున్నత స్థాయిలో వెళ్తారు. ప్రతి విషయంలోనూ ఇన్ టైంలో పనులు పూర్తి చేయడం.. సమయానికి కార్యకలాపాలను పూర్తి చేయడం వంటివి చేయాలి. అలాంటి లక్షణాలు ఉన్నవారు త్వరగా డబ్బు సంపాదిస్తారు.
కొంతమందికి సమాజంలో శత్రువులుగా ఉండే అవకాశం ఉంది. అయితే వీరి వల్ల ఎప్పుడూ నష్టం జరిగే ఉంటుంది. అయితే వీరిని మిత్రులుగా చేసుకోవడం వల్ల వారి నుంచి ఎటువంటి అపాయం కలగకుండా ఉంటుంది. అందువల్ల శత్రువులను మిత్రులుగా భావించేవారు త్వరగా డబ్బు సంపాదిస్తారు. అంతేకాకుండా మిగతా వారి కంటే అత్యున్నత స్థాయిలో ఉంటారు.
ఇవే కాకుండా మహిళలను గౌరవించడం.. దుబారా ఖర్చులకు దూరంగా ఉండడం.. లక్ష్యం పైనే దృష్టిపెట్టడం వంటివి చేస్తూ ఉండాలి. ఇలాంటివారు మిగతా వారి కంటే దూసుకెళ్తారు. అంతేకాకుండా వీరికి సమాజంలో గుర్తింపు వచ్చి అనుకున్న పని త్వరగా పూర్తి చేస్తారు.