PM Narendra Modi : ఈ భూమిని రక్షించడానికి వీర సైనికులు ఎన్నో త్యాగాలు చేశారు వారందరికీ సెల్యూట్ అని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్ ను మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సైనికులతో మాట్లాడారు. తర్వాత అక్కడి సైనికులను ఉద్దేశించి నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు..”మన మట్టి సామర్థ్యానికి ప్రతిరూపం. మన ఆడపడుచుల నుదుట కుంకుమను తుడిచివేశారు. దానికి బదులుగా రక్తసిందూ రం అంటే ఎలా ఉంటుందో వారికి చూపించాం. భారత్ చూపించిన తెగువ.. త్రివిధ దళాల పోరాటం.. త్రివేణి సంగమం. ఉగ్రవాద దేశానికి మన వాయు సేన తన సత్తా చూపించింది. యుద్ధక్షేత్రంలో భారత్ మాతాకీ జై అనే నినాదాలు కనిపించాయి. ఇటువంటి జయజయ ద్వానాలను ప్రపంచం మొత్తం విన్నది. ప్రతి పౌరుడి నినాదం కూడా అదే అయింది. న్యూక్లియర్ హెచ్చరికలను సైతం పక్కన పెట్టాం. ఇది మన సామర్థ్యానికి ప్రతీక. ఇది మన ధైర్యానికి పతాక. మీరందరూ కలిసి చరిత్ర సృష్టించారు. మీ కోసమే నేను ఇక్కడ దాకా ప్రయాణించి వచ్చాను. మీలాంటి వీరులను చూసినప్పుడల్లా నా జన్మ ధన్యమవుతోందని” నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.
Also Read : టర్కీ–భారత్ సంబంధం.. ఊహించని మలుపు!
నట్టింట్లోకి వెళ్లి నాశనం
” మన సోదరీ సోదరీమణులు గొప్పవాళ్లు. వారు మన ఇంటి గౌరవానికి ప్రతీకలు. అటువంటి వారి నుదుటి సిందూరాన్ని వారు తొలగించారు. అలాంటి వారి స్థావరాలకు పకడ్బందీగా గురిపెట్టి కొట్టారు. వాటిని అత్యంత ధైర్యంగా నేల కూల్చారు.. మీరు ఎంతో పరాక్రమం చేసి ఉంటే ఇలాంటి ఘనత చేకూరింది. వారు మనల్ని ఇబ్బంది పెడితే.. వారి దేశంలోకి వెళ్లి మన ఘనత ఏమిటో చూపించి వచ్చాం. వారికి కనీసం శ్వాస తీసుకునే అవకాశం కూడా మనం ఇవ్వలేకపోయాం.. ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాద దేశంలో ఏ ప్రాంతాన్ని అయినా సరే గురి చూసి కొట్టగలమని నిరూపించాం. వారికి నిద్రలేని రాత్రులను పరిచయం చేసాం. వారు మనపై ఎన్నో విధాలుగా దాడులు చేయడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ మన లక్ష్మణ రేఖ వారిని దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. అందువల్లే మనం సమర్థవంతంగా ఉండగలిగాం. ఒకవేళ మళ్లీ అటాచ్ చేయగలిగితే అంతకంటే రెట్టించిన స్పీడుతో కౌంటర్ ఎటాక్ మనం ఇవ్వగలం. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అనేది లెక్కలోకి తీసుకోమని మనం స్పష్టం చేశాం. ఉగ్రవాదులను.. వారి వెనుక ఉండి ప్రోత్సహిస్తున్న వారిని మేం వేరువేరుగా చూడం. కష్టంగా అందరికీ ఒకే తీరైన సమాధానం ఇస్తామని” నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.. మొత్తానికి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం సైనికుల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన స్థాయిని పక్కనపెట్టి.. ప్రతి సైనికుడితో మాట్లాడారు. భుజం తట్టి ప్రోత్సహించారు. వారితో కరచాలనం చేశారు.
Also Read : ఆపరేషన్ సిందూర్ కు.. ఏపీలోని బందరు కు ఏంటి సంబంధం? రోమాలు నిక్కబడిచే స్టోరీ ఇదీ!