Chanakya Advice to Youth: జీవితంలో ప్రతి వ్యక్తి ఏదైనా సాధించాలని అనుకుంటాడు. కానీ అనుకున్న సమయానికి అనుకున్నది కాకపోవడంతో తీవ్రంగా ఆవేదన చెందుతాడు. ఇలాంటి ఆవేదన ఒక వయసుకు వచ్చిన తర్వాత ఉంటుంది. అంతకు ముందు జరిగే యవ్వనంలో ఎలాంటి ఆవేదన కనిపించదు. కానీ యవ్వనంలో అనేక రకాలుగా అవకాశాలు ఉంటాయి. కానీ కొందరు వాటిని మిస్ చేసుకుంటారు.వయసు పై పడిన తర్వాత అవకాశాల గురించి ఆలోచిస్తూ బాధపడతారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఉన్న యువత అయిన తనకున్న అవకాశాలను విడిచిపెట్టకుండా ఉండాలి. అందుకోసం ఏం చేయాలి? ఏ విధంగా ప్రవర్తించాలి?
Also Read: అచ్చం అపాచీ లాంటిదే.. దానికంటే రూ.77 వేలు తక్కువకే అదిరిపోయే బైక్
చాణక్యుడు ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన సూత్రాలను ప్రజలకు అందించాడు. వాటిని చాలామంది మౌర్య సామ్రాజ్యం నుంచి ఇప్పటివరకు ఫాలో అవుతూ వస్తున్నారు. అయితే చాణక్యుడు సాధారణ వ్యక్తుల గురించి మాత్రమే కాకుండా యువత గురించి కూడా అప్పుడే కొన్ని విషయాలు చెప్పాడు. ఒక యువత తన వయసులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఏం చేయాలి? అనే విషయాలను వివరించాడు.
సాధారణంగా యవ్వనం వయసులో ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఈ సమయంలోనే ఏదైనా కొత్త ప్రాజెక్టును ప్రారంభించిన దానిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా కెరీర్ పై నిర్ణయం తీసుకున్నా.. ఇదే గోల్డెన్ ఛాన్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ఇప్పుడు ప్రవర్తన ఎలా ఉంటే.. భవిష్యత్తులో జీవితం అలా ఉంటుంది. అందుకోసం యువత ప్రధానంగా సమయాన్ని వృధా చేయకూడదు. ప్రతి ఒక్కరి జీవితంలో సమయం చాలా విలువైనది. ఈ సమయం కరిగిపోతే తిరిగి వచ్చే అవకాశం లేదు. అందువల్ల ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్ అని ఆలోచించాలి.
Also Read: పవర్ న్యాప్’.. మధ్యాహ్నం 15 నిమిషాలు ఇలా చేయండి.. జిమ్ ను మించిన శక్తి..
ఇప్పుడున్న యువతలో కొంతవరకు తమ కెరీర్ గురించి ఎక్కువగా ఫోకస్ పెడుతూ.. చాలా రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు. మరికొందరు మాత్రం స్నేహితులతో జల్సాలు చేస్తూ.. సమయాన్ని వృధా చేస్తున్నారు. అలా చేయడం వల్ల సమయంతో పాటు తమ శక్తి కూడా తరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 35 సంవత్సరాల లోపు వారికి ఏ పని చేయాలన్న ఉత్సాహం ఉంటుంది.. కానీ ఆ తర్వాత అప్పటివరకు మొదలుపెట్టిన పనిని మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుంది. అందువల్ల జాబ్ మారాలన్నా.. కొత్తగా వ్యాపారం చేయాలన్నా.. విదేశాలకు వెళ్లాలన్నా.. ఈ వయసులోపు వారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆ తర్వాత ఒకవేళ ఈ పనులు చేసిన అవి అంత సక్సెస్ కావాలని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు.
అందువల్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యువత తమ కెరీర్ పై ముందే ప్రణాళికలు వేసుకోవాలి. కొంతమంది యవ్వనంలోనే ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కానీ ఎంజాయ్ గురించి ఆలోచిస్తే భవిష్యత్తు అంధకారంగా మారిపోయే అవకాశం ఉంది. అయితే కాలక్షేపం గడపడానికి ఒక సమయాన్ని కేటాయించాలి.. ఓవైపు సరదాగా ఉంటూనే.. మరోవైపు కెరీర్ పై తీవ్రమైన కసరత్తు చేయాలి. ఇలా రెండు వైపులా ప్రయత్నాలు చేస్తే అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందువల్ల యువత ఎట్టి పరిస్థితిలో సమయాన్ని వృధా చేయకూడదు అని చాణక్యుడు చెప్పారు.