Jobs: రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. హైదరాబాద్ లో ఉన్న ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. భారత ప్రభుత్వ గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సంబంధించిన ఈ సంస్థ కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. మొత్తం 4 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం.
భారత ప్రభుత్వ గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ, రీజనల్ కో-ఆర్డినేటర్స్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మాస్టర్స్ డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. కంప్యూటర్ నైపుణ్యాలతో పాటు అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 50,000 రూపాయల వేతనం లభించనుంది.
ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. 2022 సంవత్సరం జనవరి 22వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం. http://rcueshyd.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
భారీ వేతనం లభిస్తుండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగానే ఉంటుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరగనుంది.
[…] Kerala CM Pinarayi Vijayan: కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ది ప్రత్యేక శైలి. పరిపాలనలో ఆయన అవలంభించే విధానాలే ఆయనకు రెండో సారి సీఎం పీఠం దక్కేలా చేసిందని చెబుతారు. ఇటీవల ఆయన ఆరోగ్య చికిత్స కోసం అమెరికా వెళ్లారు. అక్కడే మూడు వారాల పాటు చికిత్స తీసుకుంటారు. దీంతో పరిపాలన వ్యవహారాలు చూసుకోవడానికి ఎవరికి బాధ్యతలు మాత్రం అప్పగించలేదు. దీంతో అక్కడ నుంచే పరిపాలన వ్యవహారాలు చూస్తానని తెలియడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి బెడ్ మీద నుంచే బాధ్యతలు నెరవేర్చే అవకాశం ఏర్పడింది. […]