Bhama Kalapam Movie: బుల్లితెర పై తన యాంకరింగ్ తో లెజండ్ అనిపించుకున్న సుమ లీడ్ రోల్ లో ఒక సినిమా చేస్తోంది. జయమ్మ పంచాయితీ అనే ఈ చిత్రంలో ‘సుమ’నే మెయిన్ లీడ్. ఇక ఇటీవల సుమ పాత్ర స్వభావాన్ని తెలుపుతూ టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పక్కా పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ పాట బాగుంది అంటూ మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కూడా వచ్చింది. సుమ అభిమానులు కూడా ఈ సాంగ్ పై ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపించారు. కాగా ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యాంకరింగ్ కాకుండా చాలా ఏళ్ల తర్వాత సుమ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. మరీ ఈ జయమ్మ పంచాయితీ ఎలా ఉంటుందో చూడాలి.

ఇక ప్రతి వారం సరికొత్త సినిమాలతో, కొత్త రకమైన ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకులను ‘ఆహా’ బాగా అలరిస్తుంది. తెలుగు ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ లో అగ్రగామిగా దూసుకుపోతున్న ఆహా.. ఇప్పుడు మరో డిఫరెంట్ థ్రిల్లర్ ను కూడా తమ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. ప్రియమణి ప్రధాన పాత్రలో అభిమన్యు దర్శకత్వంలో డైరెక్టర్ భరత్ కమ్మ సమర్పణలో వస్తున్న సినిమా ‘భామా కలాపం’, దీనికి సంభందించి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది ఆహా. మరి ఈ ‘భామా కలాపం’ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: మధుమేహం నుంచి కాపాడే ఈ ఒక్క పండు గురించి మీకు తెలుసా?
భారత కోకిల లతా మంగేష్కర్ ఆరోగ్యం విషయానికి వస్తే.. గత కొద్దీ రోజుల క్రితం స్వల్ప కరోనా లక్షణాలతో లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి మీద బ్రీచ్ కాండీ ఆసుపత్రి వైద్యులు స్పందించారు. డాక్టర్ ప్రతిత్ సామ్ద్ మాట్లాడుతూ, లతా మంగేష్కర్ ఇప్పటికీ ఐసీయూలోనే ఉన్నారు. ఇంకా కొన్ని రోజులు ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంది, అది ఎన్ని రోజులు అనేది చెప్పడం కష్టం. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుందాం అంటూ చెప్పుకోచ్చారు.
అన్నట్టు ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి బెబమ్మగా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు భామ కృతి శెట్టి మొత్తానికి ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి సన్నద్ధం అయింది. ఈ భామ వరుస విజయాలను అందుకుంటూ గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకోవడంతో పాటు వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది. కాగా తాజాగా కృతి కళ్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించబోతుంది. ప్రత్యేక సాంగ్స్ చెయ్యడం ఈ మధ్య హీరోయిన్లకు ఫ్యాషన్ అయిపోయింది.
Also Read: తెలంగాణలో మరోసారి లాక్ డౌన్? ఈరోజు కేబినెట్ అత్యవసర భేటిలో నిర్ణయం?
[…] Injuries: గాయాలు మనిషి జీవితంలో ఏదొక సందర్భంలో బాధ బెడుతూనే ఉంటాయి. ఇక ఎముకల బెణుకుల బాధల గురించి కొత్తగా చెప్పేది ఏముంది ? మరి వీటి నివారణకు మార్గాలు ఏమిటి ? మీకు తెలుసా ? గోంగూర వీటి బాధను పోగొడుతుందని. […]