Car Tips : కొన్ని సార్లు ఏదో ప్రాబ్లంతో మధ్యలో కారు మొరాయిస్తుంది. దీని కారణంగా కారును మెకానిక్ లేదా సర్వీస్ సెంటర్‌కు నెట్టుకుంటూ తీసుకెళ్లాల్సి వస్తుంది. కానీ ఇకపై ఆ బాధలు వద్దు. మీ కారు మధ్యలో ఆగిపోతే నెట్టకుండా ఉచితంగా సర్వీస్ సెంటర్‌కు ఎలా చేర్చాలో తెలుసుకుందాం. కొత్త కారుతో చాలా ఆటో కంపెనీలు వినియోగదారుల సౌకర్యం కోసం రోడ్ సైడ్ అసిస్టెన్స్ సౌకర్యాన్ని అందిస్తాయి. కానీ మీ కారు పాతదైతే కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కారును ఉచితంగా సర్వీస్ సెంటర్‌కు చేర్చడానికి మీరు కారు ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు RSA (రోడ్ సైడ్ అసిస్టెన్స్)ని కొనుగోలు చేయాలి.
Also Read: తిరుమలలో 17 లక్షల రూపాయలతో అన్నదానం చేసిన పవన్ కళ్యాణ్ సతీమణి!
రోడ్ సైడ్ అసిస్టెన్స్ వల్ల ఉపయోగాలు
తక్కువ ధరలో లభించే ఈ యాడ్-ఆన్ చాలా ఉపయోగకరమైనది. రోడ్ సైడ్ అసిస్టెన్స్ తీసుకున్న తర్వాత, మీ కారు ఎక్కడ ఆగిపోయినా, మీ కారును ఉచితంగా సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడానికి టోయింగ్ క్రేన్ వస్తుంది. ఇన్సూరెన్స్‌తో పాటు ప్రారంభంలో ఈ యాడ్-ఆన్ కొనుగోలు చేయడానికి మీరు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కానీ మీరు ఎక్కడో చిక్కుకుపోయి, సమీపంలో మెకానిక్ లేకుంటే, మీరు ఈ సౌకర్యాన్ని పూర్తిగా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
మీరు తర్వాత కారును సర్వీస్ చేయించుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రోడ్ సైడ్ అసిస్టెన్స్ లేని వారు రోడ్డుపై తామే నెట్టుకుంటూ వెళ్లాలి లేదా కారును టో చేయడానికి క్రేన్ పిలవాలి. దీని కోసం వారు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కారు ఇన్సూరెన్స్ కొనుగోలు చేసిన తర్వాత కొన్ని కంపెనీలు 15 రోజుల్లోపు ఈ యాడ్-ఆన్ కొనుగోలు చేయడానికి సౌకర్యాన్ని అందిస్తాయి. కానీ ఈ సమయం దాటిపోతే మీరు తదుపరి సంవత్సరం ఇన్సూరెన్స్ రెన్యూ చేసేటప్పుడు మాత్రమే ఈ యాడ్-ఆన్ కొనుగోలు చేయవచ్చు.