Pawan Kalyan: సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) గాయాలపాలైన ఘటన గత వారం రోజుల నుండి నేషనల్ లెవెల్ లో ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. అయితే ఎట్టకేలకు చికిత్స ద్వారా కోలుకున్న మార్క్ శంకర్ మొన్ననే ఇండియా కి తన అమ్మానాన్నలతో కలిసి ఇండియా కి తిరిగొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే బిడ్డ కి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడినందుకు కృతజ్ఞతగా పవన్ కళ్యాణ్ సతీమణి తన మొక్కుని తీర్చుకోవడం కోసం తిరుమలకు వచ్చింది. నిన్న రాత్రి ఆమె తలనీలాలు కూడా సమర్పించింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బాగా ట్రెండ్ అయ్యాయి. క్రైస్తవ మతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ హిందూ దేవుళ్లపై ఆమె చూపించిన భక్తి శ్రద్ధలను చూసి అభిమానులతో పాటు నెటిజెన్స్ కూడా ప్రశంసిస్తున్నారు.
Also Read: ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్…
కాసేపటి క్రితమే ఆమె అన్నదానం కోసం తిరుమలలో 17 లక్షల రూపాయిల విరాళం అందించి, తన చేతుల మీదుగా భక్తులకు వడ్డించింది. అనంతరం ఆమె సాధారణ భక్తులతో కూర్చొని భోజనం కూడా చేసింది. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సతీమణి అయినప్పటికీ, ఇసుమంత గర్వం కూడా లేకుండా ఆమె ప్రవర్తించిన తీరు ఎంతో ఆదర్శప్రాయం అని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆమెతో కలిసి రాలేదు కానీ, ఒంటరిగా వెళ్లి తన మొక్కుని చెల్లించుకొని, చేయాల్సిన కార్యక్రమాలు చేసి నేడు తిరుగు ప్రయాణం కానుంది. క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు భర్త అడుగుజాడల్లో నడుస్తూ, ఇలా కూడా జీవించే వాళ్ళు ఉంటారా అని అన్నా లెజినోవా(Anna Lezhneva) ని చూసినప్పుడే అర్థం అవుతుందని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది తెలుగు అమ్మాయిలు కూడా పాటించని పద్ధతులు అన్నా లెజినోవా పాటించడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసే విషయమే.
ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. మంగళగిరి క్యాంప్ ఆఫీస్ కి ఎప్పుడు వస్తాడు అనే దానిపై క్లారిటీ ఇంకా రాలేదు. ఒకపక్క ఆయన ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ లో పాల్గొంటాడని టాక్ నడుస్తుంది. దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. సోషల్ మీడియా లో అభిమానులు పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి నిర్మాతలను వేధించకుండా, దయచేసి ఆ నాలుగు రోజుల షూటింగ్ పూర్తి చేయమని ప్రాధేయపడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే ఇప్పప్పుడే డేట్స్ కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. మరోపక్క ఆయన ఉప ముఖ్యమంత్రిగా విధుల్లోనూ చురుగ్గా లేరు, అభిమానులు పవన్ కళ్యాణ్ విషయంలో చాలా అసంతృప్తితో ఉన్నారు. చూడాలి మరి ఆయన మళ్ళీ ఎప్పుడు పూర్తి స్థాయిలో యాక్టీవ్ అవుతాడు అనేది.