Head Bath: ప్రతి రోజూ తలస్నానం చేయొచ్చా..? చేస్తే జరిగేది ఇదే

సాధారణంగా దుమ్ము, ధూళిలో పని చేసేవారు, పని చేసే సమయంలో ఎక్కువగా చెమటలు పట్టే వారు, అలాగే తేమతో కూడిన వాతావరణంలో ఉండే వ్యక్తులు తరచూగా తలస్నానం చేయాలి. అదేవిధంగా పని కోసం దూర ప్రయాణాలు చేసే వారు కూడా రోజూ తలస్నానం చేయాలి.

Written By: Suresh, Updated On : December 21, 2023 1:07 pm

Head Bath

Follow us on

Head Bath: సాధారణంగా మనలో చాలా మందికి ప్రతిరోజూ ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం స్నానం చేస్తుండటం అలవాటే. అయితే కొందరు రోజు స్నానం చేసినప్పటికీ తలస్నానం మాత్రం రెండు, మూడు రోజులకు ఒకసారి అలా చేస్తుంటారు. లేదా వారానికి ఒకసారి తలస్నానాన్ని ఆచరిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే చాలా మంది మాత్రం ఏ కాలంలో అయినా సరే రోజూ తలస్నానం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ విధంగా ప్రతిరోజు తలకు స్నానం చేయొచ్చా? లేదా ? అన్నది ప్రతి ఒక్కరికీ ప్రశ్నార్థకంగా మిగిలింది. అయితే దీనిపై కొందరు నిపుణులు మాట్లాడుతూ ప్రతి రోజూ కాకపోయినా.. కొన్ని రోజులకు ఒకసారి తలస్నానం చేయొచ్చని తెలిపారని సమాచారం. కాకపోతే అందులో కొన్ని మినహాయింపులు చెప్పడం గమనార్హం.

సాధారణంగా దుమ్ము, ధూళిలో పని చేసేవారు, పని చేసే సమయంలో ఎక్కువగా చెమటలు పట్టే వారు, అలాగే తేమతో కూడిన వాతావరణంలో ఉండే వ్యక్తులు తరచూగా తలస్నానం చేయాలి. అదేవిధంగా పని కోసం దూర ప్రయాణాలు చేసే వారు కూడా రోజూ తలస్నానం చేయాలి. ఈ విధంగా స్నానం చేయడం వలన శరీరం, జుట్టుపై ఉన్న దుమ్ము, ధూళి పోతుంది. మానసిక ప్రశాంతత చేకూరడంతో పాటు ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి.

ఈ విధంగా రోజూ తలస్నానం చేయకపోతే దుమ్ము, ధూళి పేరుకుపోయి జుట్టు రాలిపోవడంతో పాటు దురద వంటి సమస్యలు వెంటాడుతాయని నిపుణులు చెబుతున్నారు. దుమ్ము, ధూళిలోకి వెళ్లని వ్యక్తులు రెండు, మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ క్రమంలోనే మగవారు అయితే రోజు విడిచి రోజు, మహిళలు అయితే వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుందని డాక్టర్లు వెల్లడించారు. కాలుష్య బారిన పడేవారు మాత్రం తప్పనిసరిగా తలస్నానం చేయాలి. కానీ తరచూ ఇలా చేయడం వలన జుట్టు పాడవకుండా మరి కొన్ని చర్యలు తీసుకోవాలి. గాఢత తక్కువ ఉన్న షాంపూలు, కండీషనర్లు వాడాలి. అలాగే జుట్టును ఆరబెట్టుకునేందుకు హెయిర్ డ్రయ్యర్ ను వాడకుండా ఉంటే మంచిది.