Homeలైఫ్ స్టైల్Parents: పిల్లలు ఫోన్ తరచూ వాడకుండా తల్లిదండ్రులు చేయాల్సిన పని ఇదే

Parents: పిల్లలు ఫోన్ తరచూ వాడకుండా తల్లిదండ్రులు చేయాల్సిన పని ఇదే

Parents : కొవిడ్ పుణ్యమాని పిల్లలు మొబైల్ లకే అతుక్కుపోతున్నారు. వారికి మొబైల్ ఇవ్వడంతో ఇక వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. దీనివల్ల అనర్థాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసికంగా కూడా చెడు జరిగే సూచనలున్నా నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల నడవడికపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని సూచిస్తున్నారు. వారు ఏం చేస్తున్నారనే దానిపై ఓ కన్ను వేయాల్సిన అవసరం ఏర్పడింది.

Parents
Parents

పిల్లలకు చదువుతోపాటు ఆటల్లో కూడా ప్రావీణ్యం ఉండేలా చూసుకోవాలి. చదువెంత ముఖ్యమో ఆటలు కూడా అంతేనని వివరించాలి. అందులో కూడా ప్రవేశం ఉండేలా సిద్ధం చేయాలి. వారికి ఏ ఆటపై మక్కువ ఉందో గుర్తించి అందులోనే ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రణాళికలు తయారు చేసుకుని వారిని ఆటల్లో రాణించేలా ప్రోత్సహించాలి. అప్పుడే ఆరోగ్యం కూడా బాగుండి అన్నింట్లో ముందుంటారు.

కొత్త విషయాలు కనిపెట్టేందుకు వారిలోని తెలివితేటల్ని బయటకు తీసేలా చూడాలి. ఎప్పుడు బిజీగా ఉండే మనం వారిలోని ప్రతిభకు ఎప్పుడు ప్రాణం పోస్తుండాలి. దీనికి గాను కొత్త కొత్త వస్తువుల ఆవిష్కరణకు వారికి సాయపడాలి. నూతన విషయాలు కనుగొనేందుకు వారికి అన్ని వసతులు కల్పించాలి. అప్పుడే వారిలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది.

Also Read: Father: చాణక్య నీతి: పిల్లల విజయంలో తండ్రిది కీలక పాత్రేనా?

పుస్తకపఠనంపై కూడా శ్రద్ధ వహించాలి. దీంతో విషయాలపై అవగాహన పెరుగుతుంది. ప్రపంచంపై పట్టు ఉంటుంది. ఖాళీ సమయం దొరికితే చాలు పుస్తకాలు చదవడం కూడా మంచి అలవాటే. మంచి తెలివి కావాలంటే పుస్తక పఠనమే దగ్గర దారి అని తెలుసుకోవాలి. దీని కోసం ఎందరో్ పుస్తకాలు చదివి తమ మేథోశక్తిని పెంచుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.

పిల్లల మానసిక పరివర్తనలో మార్పు తెచ్చేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలి. వారిలోని శక్తియుక్తులను బయటకు తెచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే వారికి కూడా మంచి స్థానం సంపాదించుకునే వీలుంటుంది. పిల్లల ఎదుగుదలకు మొదటి గురువులు తల్లిదండ్రులే అన్న సంగతి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.

Also Read: పాపాలతోనే పాడు జన్మలు సంప్రాప్తిస్తాయా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version