Health Benefits Of Eggs: రోజుకో గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్డు శాఖాహారమే అని వాదించే వారు కూడా ఉన్నారు. దీంతో గుడ్డు ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో తెలుసుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి. సండే అయినా మండే అయినా గుడ్డు తినండి గుడ్ గా ఉండండి అని ప్రచారం చేస్తున్నారు. గుడ్డు ఆరోగ్యానికి మంచిదే. ఇందులో ఉండే ప్రొటీన్లు, మినరల్స్ మనకు మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. ఎన్సీబీఐ నివేదిక ప్రకారం గుడ్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతోంది.

రోజుకు రెండు గుడ్లు తింటే ఊబకాయం తగ్గుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.
ఒక గుడ్డులో 75 కేలరీలు, 5 గ్రాముల కొవ్వు, 6 గ్రాముల ప్రొటీన్, 70 గ్రాముల సోడియం, 67 మిల్లీ గ్రాముల పొటాషియం, 210 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉన్నాయి. విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ బి12 గుడ్డులో ఇమిడి ఉన్నాయి. గుడ్డులో ఉండే కోలిన్ జీవక్రియను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. గుడ్డును రోజు తింటే ఎన్నో లాభాలున్నాయి. డాక్టర్లు కూడా గుడ్డు తింటే శరీరానికి బలం చేకూరుతుందని చెబుతున్నారు.
గుడ్డు తింటే అధిక కొవ్వు ఏర్పడే ప్రమాదముందని చెప్పేవి అపోహలే. గుడ్డులో ఉండే కొలెస్ట్రాల్ శరీరానికి ప్రతికూలంగా మారదు. గుడ్డును వెన్న లేదా నూనెలో ఎక్కువ సేపు ఉడికిస్తే హాని కలుగుతుంది. గుండె జబ్బులున్న వారు కూడా గుడ్డు తినవచ్చు. ఇది గుండెకు ఎలాంటి నష్టం చేయదు. చెడు కొవ్వును తొలగిస్తుంది. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు కూడా అందిస్తుంది. గుడ్డులో ఉండే తెల్ల సొన తిన్నా పచ్చ సొన మాత్రం తింటే ప్రమాదమేనని చెబుతున్నారు. గుడ్డు గుండెకు హానికరమనేది కేవలం అపోహే అని వైద్యులు సూచిస్తున్నారు.

గుండె జబ్బులున్న వారు కూడా రోజుకు ఓ గుడ్డు తింటే మంచిదే. చౌకగా లభించే గుడ్డును ఉదయం తీసుకుంటే ప్రయోజనమే. దీనిలో ఉండే విటమిన్లు, ప్రొటీన్లతో మన శరీరానికి లాభమే. గుడ్డు తీసుకుంటే ఎలాంటి అనర్థాలు ఉండవు. కోడి గుడ్డు తినడం వల్ల ఎలాంటి అనర్థాలు లేవు. రోజుకు రెండు గుడ్లు తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఆరోగ్యవంతులైన వారు రోజు రెండు గుడ్లు తినాలని అనే పరిశోధనలు చెబుతున్నాయి. ఇతర ఆహారాలకంటే గుడ్డులో ఎక్కువ లాభాలు ఉన్నాయని తెలుసుకుని వాడుకుంటే మంచిది.