Pawan Kalyan Survey: ఏపీ రాజకీయాల్లో జనసేనాని పక్క ప్రణాళికతో ముందుకెళుతున్నాడు. పార్టీకి రాజ్యాధికారమే లక్ష్యంగా సాగుతున్నారు. ఈక్రమంలోనే సర్వేలు చేస్తూ పార్టీకి బలం బలహీనత ఎక్కడ ఉంది? ఎక్కడ పోటీచేయాలి? పొత్తులు ఎక్కడ పెట్టుకోవాలన్న విషయంలో సర్వేలు చేయిస్తున్నారు. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ కసరత్తు సాగుతోంది.

ఈక్రమంలోనే పవన్ కళ్యాణ్ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూసినట్టు తెలుస్తోంది. వైసీపీకి ఎంత ప్రయత్నించినా కూడా వ్యతిరేకత వల్ల బాగా సీట్లు తగ్గుతాయని సర్వేలో తేలిందట.. జగన్ పై వ్యతిరేకత పెరిగిందని.. ఏపీలో టీడీపీ, జనసేన కనుక కలిస్తే ఖచ్చితంగా ఆ వైసీపీ వ్యతిరేక ఓటు పూర్తిగా ప్రతిపక్షాలకు పడుతుందని తేలింది. అందుకే ఆ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పవన్ సభల్లో చెప్పుకొచ్చింది.
పవన్ చేసిన సర్వేలో వైసీపీకి 60-65 సీట్లు మించి రావని తేలిందట.. అంటే మిగతా 110 సీట్లు టీడీపీ, జనసేనలకు వస్తాయని పవన్ సర్వేలో తేలింది. ఇందులో కనీసం 40-50 సీట్లు అయినా జనసేన వస్తాయని.. టీడీపీకి ఓ 60 సీట్లు వస్తాయని పవన్ సర్వేలో తేలింది. దీంతో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతాడని.. కాలం కలిసి వస్తే సీఎం సీటు కూడా రావచ్చని జనసేన భావిస్తోంది.

కర్ణాటకలో 40 సీట్లు గెలిచిన కుమారస్వామిని అక్కడి కాంగ్రెస్ పార్టీ సీఎంను చేసింది. ఇప్పుడు జగన్ ను ఓడించడానికి ఇదివరకే మూడు నాలుగు సార్లు సీఎం అయిన చంద్రబాబు కూడా పవన్ ను సీఎం చేయవచ్చని అంటున్నారు. ఈ స్ట్రాటజీతోనే పవన్ జనాల్లోకి దూకుడుగా వెళుతున్నాడని సమాచారం.