Degree PG Jobs: భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఈ సంస్థకు సంబంధించిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ నుంచి అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ (ఎంఏఎస్ బీ3) పోస్టులు 2, క్లర్క్ పోస్టులు 2, జూనియర్ అసిస్టెంట్ (ఎంఏఎస్ బీ4) పోస్టులు 4, ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 19,900 రూపాయల నుంచి 92,300 రూపాయల వరకు వేతనంగా లభించనుందని సమాచారం అందుతోంది. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: TRS Party Dissent: టీఆర్ఎస్ లో అసంతృప్తి మంటలు.. అంటుకోవడం ఖాయమా?
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. https://www.cdac.in/index.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు 295 రూపాయలుగా ఉండగా మిగిలిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజులో మినహాయింపు ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.