Makeup Artist Holly Murray: మనుషులు అందంగా కనిపించడానికి మేకప్ ముఖ్యమని భావించే వారు చాలామంది ఉన్నారు. అయితే కొందరు అందం కోసం మేకప్ తీసుకుంటే మరికొందరు గిన్నిస్ రికార్డు కోసం కూడా మేకప్ వేసుకునే పరిస్థితికి నచ్చింది. ఇటీవల బ్రిటన్ కు చెందిన కళాకారుని హోలీ ముర్రే తన ఆలోచనలతో కొత్త ఆవిష్కరణ చేశారు. 74,880 స్పటికాలతో తన శరీరాన్ని పూర్తిగా అలంకరించుకొని ఎన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. అసలు ఎవరు ఈ హోలీ ముర్రే? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది?
హోలీ ముర్రే మేకప్ వేయడానికి వృత్తిగా పెంచుకున్నారు. ఈమె మేకప్ కు ఎంతోమంది ఫిదా అయ్యారు. ఈమె మేకప్ వేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆమెకు ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోయారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఆసక్తికరమైన కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. ఒకసారి ఆమె ‘ నా శరీరాన్ని ఒక కాన్వాసుల భావించి అందం, కళ కలిసే కొత్త రూపాన్ని చూపించాలని అనుకుంటున్నాను’ అని పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా ఆమె 2025 జనవరి 16న ఇటలీ దేశంలోని మిలాన్ నగరంలో జరిగిన ప్రసిద్ధ టెలివిజన్ ప్రోగ్రాం ‘లా షో డే రికార్డ్’ లో 74, 880 స్పటికలను శరీరానికి క్రమ పద్ధతిగా అమర్చారు. ప్రతి ఒక్క స్పటికంతో తన టీం తో సహా ఆమె శరీరాన్ని సమతుల్యంగా తీర్చిదిద్దారు.
ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు 15 గంటల సమయం పట్టినట్లు ఆమె తెలిపారు. ఇది పూర్తి కావడానికి చాలా కష్టమే అయింది. కానీ ఈ ప్రాజెక్టు నా జీవితంలో అత్యంత గర్వకారణమైనది అని ఆమె తెలిపింది. ఈ ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీసింది. అంతేకాకుండా ఆమె అందానికి అనేకమంది ప్రశంసలు కురిపించారు. ఒక వ్యక్తి పూర్తిగా కళాత్మకంగా మారవచ్చు అని హోలీ ముర్రే నిరూపించారు. పటికాలు ఆమె శరీరాన్ని కళాఖండం గా మార్చాయి అని కొందరు కామెంట్లు చేశారు.
ఈ ప్రదర్శనకు ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. అందం అంటే కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కాదని కళాత్మకం కూడా ఉంటుందని ఆమె నిరూపించారు. తన ఆలోచనలతో కొత్త కొత్త ప్రదర్శనలు చేసే అవకాశం ఉందని మరికొందరు చెప్పారు. అయితే హోలీ ముర్రే గతంలోనే ఫేమస్ మేకప్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఇలా సరికొత్త ప్రయోగంతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మేకప్ విషయంలో సరికొత్త చరిత్రను రాసిన హోలీ మురళి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.