Khaidi Movie Child Artist: లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) పేరు దేశం మొత్తం మారుమోగిపోయేలా చేసిన చిత్రం ‘ఖైదీ'(Khaidi Movie). కార్తీ(Karthi Sivakumar) హీరో గా నటించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. ఒక సినిమా అన్ని విభాగాల్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఖైదీ కి అలా అన్ని విభాగాలు పర్ఫెక్ట్ గా కుదిరాయి. ఇప్పటికీ లోకేష్ సినిమాల్లో ది బెస్ట్ ఏమిటి అని అడిగితే, మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు ఖైదీ. అంతటి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కేవలం ఒక్క రాత్రి జరిగే సంఘటనలను ఆధారంగా తీసుకొని సినిమాని తెరకెక్కించడం అంత తేలికైన విషయం కాదు. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండాలి. ఆ విషయం లో డిస్టింక్షన్ మార్కులు అందుకున్నాడు డైరెక్టర్ లోకేష్. ఇక కార్తీ నటన కూడా అద్భుతం అనే చెప్పాలి.
ఈ చిత్రానికి సీక్వెల్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సీక్వెల్ పై ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఎప్పుడో ఈ సీక్వెల్ తెరకెక్కాల్సి ఉంది. కానీ మధ్యలో మాస్టర్, విక్రమ్, లియో, కూలీ వంటి చిత్రాలు చేయాల్సి వచ్చింది. కానీ ఈ ఏడాది ఎట్టి పరిస్థితిలోనూ ‘ఖైదీ’ సీక్వెల్ ని సెట్స్ మీదకు తీసుకొస్తానని మీడియా కి అనేక సార్లు చెప్పుకొచ్చాడు. ఒక పెద్ద డ్రగ్ మాఫియా ని బ్రేక్ చేసి, జైలు నుండి బయటకు వెళ్లిన తర్వాత హీరో జీవితం ఎలా ఉండబోతుంది?, జైలు కి వెళ్ళకముందు ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏంటి?, ఏ పని చేయడం వల్ల అతను జైలు కి వెళ్లాల్సి వచ్చింది అనేది ఈ సీక్వెల్ లో చూపించనున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి, ఇందులో విక్రమ్ మరియు రోలెక్స్ పాత్రలు కూడా ఉండొచ్చు.
ఇదంతా పక్కన పెడితే ‘ఖైదీ’ లో కార్తీ కూతురు క్యారక్టర్ లో నటించిన చిన్నారి గుర్తుందా?, అంత తేలికగా మర్చిపోయే క్యారక్టర్ కూడా కాదు అది. క్లైమాక్స్ లో కార్తీ తో సమానంగా ఎమోషనల్ సన్నివేశంలో నటన ఉతికి ఆరేసింది. ఆ చిన్నారి పేరు మోనికా శివ. ఈమెకు ఇదే తొలి చిత్రం. ఖైదీ చిత్రం విడుదలై ఆరేళ్ళు పూర్తి అయ్యింది. ఈ ఆరేళ్లలో ఆ పాప పెరిగి పెద్దది అయ్యింది. ఇప్పుడు గుర్తుపట్టలేని రేంజ్ లో ఉంది. మరి ఇప్పుడు ఖైదీ సీక్వెల్ లో ఈమె ఢిల్లీ కూతురుగా నటిస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు పెరిగి బాగా పెద్దది అయ్యింది కాబట్టి, ఆ క్యారక్టర్ కోసం వేరే బాలనటిని చూసుకోవాల్సిందే అని అంటున్నారు విశ్లేషకులు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన మోనికా ఫోటో ని మీరు కూడా చూసేయండి.
View this post on Instagram