Homeఎంటర్టైన్మెంట్Peddi Release Date: రామ్ చరణ్ 'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ ప్రకటన.. ఆ...

Peddi Release Date: రామ్ చరణ్ ‘పెద్ది’ కొత్త రిలీజ్ డేట్ ప్రకటన.. ఆ ప్లాన్ వర్కవుట్ అయితే బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు పక్కా!

Peddi Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాలీవుడ్ నుండి ప్రస్తుతం రాబోతున్న చిత్రాల్లో వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేంత సత్తా ఉన్న చిత్రాల్లో ‘పెద్ది’ కూడా ఒకటి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి, ‘చికిరి చికిరి’ పాటకు గ్లోబల్ వైడ్ […]

Peddi Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాలీవుడ్ నుండి ప్రస్తుతం రాబోతున్న చిత్రాల్లో వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేంత సత్తా ఉన్న చిత్రాల్లో ‘పెద్ది’ కూడా ఒకటి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి, ‘చికిరి చికిరి’ పాటకు గ్లోబల్ వైడ్ గా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో కేవలం తెలుగు వెర్షన్ కి 160 మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉంది అనే విషయాన్ని. ఇకపోతే మొదటి నుండి ఈ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27 న విడుదల చేస్తారని చెప్పుకుంటూ వచ్చారు మేకర్స్.

కానీ షూటింగ్ ఇంకా చాలా వరకు బ్యాలన్స్ ఉంది. అందుకే ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. కాసేపటి క్రితమే ఈ సినిమా విడుదల తేదీ పోస్టర్ ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఏప్రిల్ 30వ తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారట. ఏప్రిల్ 30న విడుదల అయితే, పక్క రోజే మే 1 ‘మే డే’ సందర్భంగా నేషనల్ హాలిడే. ఆ వీకెండ్ మొత్తం పాన్ ఇండియా లెవెల్ లో కళ్ళు చెదిరే ఓపెనింగ్ వసూళ్లు నమోదు అవుతాయి. ఇక పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఫుల్ రన్ వసూళ్లు ఉంటాయి. హిందీ లో కూడా ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉండడం తో అక్కడ కూడా సెన్సేషనల్ ఓపెనింగ్ దక్కే అవకాశం ఉంది. ఇకపోతే నేడు విడుదల చేసిన పోస్టర్ కి కూడా ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

రామ్ చరణ్ ఇంటెన్స్ లుక్ ని చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి వచ్చిన ప్రతీ కంటెంట్ సిక్సర్ లాగానే అనిపించింది. త్వరలోనే ఈ సినిమా నుండి రెండవ పాటని విడుదల చేయబోతున్నారు. ‘చికిరి చికిరి’ పాటకే ఫ్యాన్స్ మెంటలెక్కిపోయారు, ఇక రెండవ పాట అంతకు మించి ఉందట. డ్యాన్స్ స్టెప్పులు కూడా అదిరిపోయాయి అని టాక్. ఇక ఈ పాటకు ఏ రేంజ్ సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుందో చూడాలి. బుచ్చి బాబు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకు AR రెహమాన్ సంగీతం అందించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper