Dead sea: స్విమ్మింగ్ చేయడం చాలా మందికి ఇష్టం. కానీ కొందరికి స్విమ్మింగ్ రాదు. ఎక్కువగా గ్రామాల్లో ఉండే వాళ్లకు స్విమ్మింగ్ వస్తుంది. ఎందుకంటే సరదా కోసమైన స్విమ్ చేస్తుంటారు. అదే పట్టణాల్లో అయితే ఆరోగ్యానికి మంచిదని నేర్చుకుంటారు. స్విమ్మింగ్ వస్తే బీచ్, జలాశయాలు ఇలా ఎక్కడికి వెళ్లిన ప్రమాదం ఉండదు. ఎలాగైనా కూడా స్విమ్ చేస్తారు. ఒకవేళ స్విమ్ రాకపోతే నదులు, బీచ్, జలాశయాలకు వెళ్తే మాత్రం ప్రాణాలు కోల్పోవాలి. కానీ ఈ ప్రపంచంలో ఓ సముద్రంలో మాత్రం ఈత రాకపోయిన మునిగిపోరట. సాధారణంగా ఈత రాకపోతే నీటిలో మునిగిపోతారు. కానీ ఈ సముద్రంలో ఎందుకు మునిగిపోరు. దీనికి గల కారణం ఏంటి? ఈ సముద్రం ఎక్కడ ఉంది? అసలు ఈ సముద్రం లోతు ఉండదా? అనే అన్ని ప్రశ్నలను సమాధానం తెలుసుకోవాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
ఇజ్రాయెల్, జోర్డాన్ మధ్య ఓ సముద్రం ఉంది. అదే డెడ్ సీ లేదా మృత సముద్రం అని కూడా అంటారు. ఈ సముద్రంలో ఎవరూ దిగిన కూడా మునిగిపోరు. ఎందుకంటే ఈ సముద్రం నీళ్లలో ఎక్కువగా ఉప్పు ఉంటుంది. అందుకే ఈ సముద్రంలో ఎవరూ మునిగిపోరు. అయితే సముద్రం అన్నాక ఉప్పు అనేది సహజం. మరి అన్ని సముద్రాల్లో కూడా ఉప్పు ఉంటుంది. మరి అందులో దిగితే ఎందుకు మునిగిపోతున్నారని అనుకోవచ్చు. అయితే ఈ మృత సముద్రం భూమిపై అత్యల్ప లోయలో ఉంది. దీనివల్ల చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి దాదాపు అన్ని ఖనిజాలు కూడా దానిలోపలికి కొట్టుకుపోతాయి. దీనివల్ల ఈ సముద్రంలో ఎక్కువగా ఖనిజాలు, ఉప్పు ఉంటాయి. మిగతా సముద్రాలతో పోలిస్తే ఈ మృత సముద్రంలో 10 రెట్లు ఎక్కువగా ఉప్పు ఉంటాయి. ఈ కారణం వల్లనే ఇక్కడ ప్రజలు ఎవరూ ఈత కొట్టిన మునిగిపోరు. ఈ మృత సముద్రంలో అధికంగా లవణీయత ఉంటుంది. దీనివల్ల నీటి మొక్కలు లేదా చేపల వంటి స్థూల జల జీవులు కూడా ఉండవు. ఇందులో సొరచేపలు కూడా ఉండవు.
లవణాల వల్ల ఈ సముద్రాన్ని డెడ్ సీ లేదా మృత సముద్రం అని పిలుస్తారు. ఈ మృత సముద్రంలో దాదాపు 35 శాతం ఉప్పు ఉంటుంది. ఇంత ఉప్పుగా ఉండటం వల్ల ఎలాంటి జీవి కూడా జీవించలేదు. మృత సముద్రం ఉప్పు అక్కడ రాళ్లపై కనిపిస్తుంది. సోడియం క్లోరైడ్ ఉండటం వల్ల అవి మెరుస్తూ ఉంటాయి. అయితే ఈ సముద్రానికి పర్యాటకులు ఎక్కువగా వెళ్తుంటారు. ఈ సముద్రంలో ఎవరైనా ఈత కొట్టవచ్చు. ఇందులో ఈత కొట్టడం వల్ల ఆరోగ్యానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయట. మృత సముద్రంలోని ఔషధ గుణాలు, హైలురోనిక్ యాసిడ్ చర్మానికి మేలు చేస్తాయి. అందుకే చాలా మంది పని పెట్టుకుని మరి ఈ సముద్రంలో ఈత కొట్టడానికి వెళ్తుంటారు. ఈ సముద్రం ఎప్పుడూ జనాలతో నిండిపోయి ఉంటుంది.