Brahmapureeswarar Temple: ఈ సృష్టికి మూలం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులంటారు. శివుడికి దేవాలయాలున్నాయి. విష్ణువుకు గుళ్లున్నాయి. కానీ బ్రహ్మకు మాత్రం ఆలయాలు లేవు. ఇది ఆయనకు ఉన్న శాపంగా చెబుతుంటారు. బ్రహ్మ దేవుడి అహంకారంతోనే ఆయనకు ఆలయాలు లేకుండా పోయాయనేది పురాణాల ద్వారా తెలుస్తోంది. అందరిని సృష్టించే బ్రహ్మకు తలపొగరు నెత్తికెక్కడంతోనే ఆయన పోటీలో ఓడి తనకు దేవాలయాలు లేకుండా చేసుకున్నాడనేది ఇతిహాసాల సారాంశం. మరి మన సృష్టికే లయకారకుడైన బ్రహ్మకు ఉన్న ఆలయాలు బహుతక్కువే. వేళ్ల మీద లెక్కించొచ్చు.

ఈ సృష్టికి తామే మూలమని బ్రహ్మదేవుడు విర్రవీగి పోతుంటాడు. ఆయన గర్వాన్ని అణచాలనే ఉద్దేశంతో మహాశివుడు తన ప్రతిరూపంగా భావించే కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదో తలను ఖండిస్తాడు. సృష్టి నిర్మాణ శక్తిని కోల్పోతావని శపిస్తాడు. దీంతో బ్రహ్మదేవుడి శక్తులన్ని అచేతనమైపోతాయి. దీంతో శివుడి అనుగ్రహం కోసం శాపవిమోచనం కలగాలని తీర్థయాత్రలు చేయాలని సంకల్పిస్తాడు. ఇందులో భాగంగా ఒక రోజు తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో తిరువత్తూరు ప్రాంతంలోని బ్రహ్మపురికి చేరుకుని ఆలయంలో ఉన్న బ్రహ్మపురీశ్వరాలయం చుట్టూ 12 లింగాలను ఏర్పాటు చేసి పూజిస్తాడు.
Also Read: Chinajiyar Swamy: కేసీఆర్ తో గ్యాప్.. సమ్మక్క-సారక్క వివాదంపై చినజీయర్ స్వామి హాట్ కామెంట్స్
బ్రహ్మదేవుడి బాధను చూసిన పరమశివుడు శాపవిమోచనం అనుగ్రహిస్తాడు. తిరిగి సృష్టి నిర్మాణం చేసుకోవచ్చని చెబుతాడు. దీంతో బ్రహ్మపురీశ్వరుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. బ్రహ్మదేవుడు సాక్షాత్తు తన తలరాతను తానే తిరిగి రాసుకుంటాడు. అంతే కాదు ఈ ఆలయంలోకి వచ్చే భక్తుల తలరాతను కూడా మార్చాలని సూచిస్తాడు. దీంతో ఈ ఆలయానికి వచ్చే భక్తులకు బాధలు దూరం చేశాడనేది స్థల పురాణం.

బ్రహ్మ తన తలరాతను తానే మార్చుకున్నందున ఈ ప్రదేశంలో తాను సృష్టించిన 12 లింగానలు ఎవరైతే పూజిస్తారో వారి తల రాతను మార్చేందుకు బ్రహ్మదేవుడు అనుగ్రహిస్తాడని ఇక్కడి భక్తుల విశ్వాసం. దీంతోనే ఇక్కడకు వేలాదిగా భక్తులు తరలి వస్తూ తమ తలరాతను మార్చాలని వేడుకోవడం విశేషం. మొత్తానికి బ్రహ్మకు ఉన్న అరుదైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి కావడం తెలిసిందే. భక్తులు తమ విధిరాతను మార్చాలని దేవుడిని కోరుకుంటారు. ఎలాంటి కష్టాలు ఉన్నా వాటిని దూరం చేయాలని కోరుతుంటారు.
Also Read: CM Jagan Election 2024: రాబోయే ఎన్నికలే లక్ష్యం.. ప్రజలతో మమేకం కావాలని జగన్ పిలుపు