
India Vs Australia- PM Modi: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం అహ్మదాబాద్ లోని మోతెరా మైదానం లో జరిగే నాలుగో టెస్ట్ లో ఆస్ట్రేలియా, భారత్ తలపడనున్నాయి.. ఈ సీరీస్ లో భారత్ 2_1 ముందంజ లో ఉంది. ఈ క్రమంలో ఎలాగైనా ఈ టెస్ట్ గెలిచి సీరీస్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పైనల్ లో బెర్త్ సాధించాలని యోచిస్తోంది.. ఇండోర్ లో ఆస్ట్రేలియా చేతిలో 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో ఈ మ్యాచ్ ను భారత్ సవాల్ గా తీసుకుంది.
మోడీ టాస్
ఈ మ్యాచ్ లో ప్రధాని మోడీ టాస్ వేయనున్నారు. కొద్ది సేపు కామెంటరీ కూడా చేయనున్నారు.. మోడీకి ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ తోడు కానున్నారు. వీరిద్దరూ కలిసి రెండు దేశాల మధ్య మ్యాచ్ వీక్షించనున్నారు.. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కామెంట్రీ చేస్తారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇరుదేశాల ప్రధాన మంత్రులు వస్తున్న నేపథ్యంలో అహ్మదాబాద్ మోతేరా మైదానంలో కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మోడీ కామెంట్రీ చేస్తే ఆటగాళ్లలో ఉత్సాహం పెరుగుతుందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే మొదటి సారి
మోడీ కామెంట్రీ చేయడం ఇదే మొదటిసారి.. ఆయన మన్ కీ బాత్ లో మాట్లాడుతూ ఉంటారు.. ఇది ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ లో మోడీ ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మాట్లాడుతూ ఉంటారు.. విద్యార్థులకు వివిధ రకాల సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు.. సమాజంలో ప్రతిభావంతులను దేశానికి పరిచయం చేస్తారు.. అభి దేశంలోని యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో.. బిసిసిఐ అహ్మదాబాద్ టెస్ట్ కు ఆస్ట్రేలియా, భారత్ ప్రధాన మంత్రులను ఆహ్వానించింది.. వారి రాకతో ఆటగాళ్లకే కాదు, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి లభిస్తుందని బిసిసిఐ భావిస్తోంది.. మరోవైపు దేశ ప్రధాని క్రికెట్ మ్యాచ్ కు హాజరుకావడం ఇదే తొలిసారి కాదు. 2011 ముంబైలో వరల్డ్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక, భారత్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు భారత ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ, శ్రీలంక అధ్యక్షుడు అప్పట్లో హాజరయ్యారు.