
Rajamouli On Oscar: ప్రపంచం మొత్తం ఒక మంచిని గుర్తించి అభినందిస్తూ ఉంటే, దానిని విమర్శిస్తూ కామెంట్స్ చేసి ఫుల్లుగా ఫోకస్ తమవైపు తిప్పుకునేందుకు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు.దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా కొంతమంది విమర్శలు చేసి నెటిజెన్స్ చేత తిట్టించుకొని అయినా ఫేమస్ అవుదామని చూస్తారు.ఇప్పుడు #RRR విషయం లో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అదే చేస్తున్నాడు.ఒకపక్క అంతర్జాతీయ అవార్డులు #RRR మూవీ తలుపులను తడుతూ తెలుగోడి సత్తాని ప్రపంచానికి తెలియజేస్తూ రామ్ చరణ్ , ఎన్టీఆర్ మరియు రాజమౌళి ప్రతిభలను గుర్తిస్తుంటే మరో పక్క తమ్మారెడ్డి భరద్వాజ కోడి గుడ్డు మీద ఈకలు పీకే కార్యక్రమం పెట్టుకున్నాడు.
ఈ ఆదివారం రోజు జరగబొయ్యే ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరి లో #RRR నుండి నామినేట్ అయినా ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ వస్తుందా లేదా అని ప్రపంచం లో ఉన్న ప్రతీ భారతీయుడు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటే, పానకం లో పుడక లాగ తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఆయన ఏమన్నారంటే ‘#RRR మూవీ కి ఆస్కార్ అవార్డు రప్పించుకోవడం కోసం, మూవీ టీం 80 కోట్ల రూపాయిలను ఖర్చు చేసింది.ఆ 80 కోట్ల రూపాయలతో 8 చిన్న సినిమాలు తీసేయొచ్చు’ అంటూ చాలా సిల్లీ కామెంట్స్ చేసాడు.దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ తమ్మారెడ్డి భరద్వాజ పై చాలా తీవ్రమైన నెగటివ్ కామెంట్స్ చేసాడు.మన తెలుగు సినిమా నటీనటులకు ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కి ఆహ్వానం అందితేనే ఎంతో గర్వంగా ఫీల్ అవుతాము.

అలాంటిది మన తెలుగు సినిమా అక్కడ నామినేషన్స్ ని దక్కించుకొని ఆస్కార్ అవార్డ్స్ గెలుపు అంచుల వరకు వెళ్ళింది అంటే సాధారణమైన విషయమా..?, ఒకవేళ ఈ ఆదివారం ఆస్కార్ అవార్డు గెలిస్తే మాత్రం ప్రపంచం మొత్తం రాజమౌళి , ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పేర్లు మారుమోగిపోతాయి.అలాంటి అరుదైన సంఘటన మన తెలుగు సినిమాకి జరగబోతున్నందుకు గర్వపడాలి కానీ, ఇలాంటి దరిద్రంగా కామెంట్స్ చేసి ఉన్న గౌరవాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు అంటూ విశ్లేషకులు సైతం తమ్మారెడ్డి భరద్వాజ పై విరుచుకుపడుతున్నారు.